చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ అంటేనేనే.. బోలెడ‌న్ని సెంటిమెంట్లు ఉన్నాయి. శుక్ర‌వారం మ‌హాల‌క్ష్మి క‌లిసివ‌స్తుంద‌నే ఉద్దేశంతోనే ద‌శాబ్దాల త‌ర‌బ‌డి సినిమాల‌ను కేవ‌లం శుక్ర‌వారం విడుద‌ల చేస్తుంటారు. అంత‌టి సెంటిమెంట్ల‌కు నిల‌య‌మైన తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఇప్పుడు ఇంకో సెంటిమెంట్ ప‌డింది.. అదే అమెజాన్ ప్రైమ్‌. ఎందుకంటే ధియేట‌ర్‌లో కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో సినిమా విడుద‌ల చేస్తే ఆ సినిమా హిట్ట‌వుతుందా? ఫ‌ట్ట‌వుతుందా? అనేది తేలిపోతోంది. విడుద‌ల చేద్దామా? వ‌ద్దా? అనే సందేహం కూడా ఇప్పుడిప్పుడే త‌లెత్తుతోంది.

అమెజాన్‌కు క‌లిసిరావ‌డంలేదు?
అమెజాన్‌కు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ క‌లిసివ‌స్తున్న‌ట్లు క‌నిపించ‌డంలేదు. ఎందుకంటే గ‌తేడాది విడుద‌లైన వి, నిశ్శ‌బ్దంతోపాటు తాజాగా విడుద‌లైన నార‌ప్ప చిత్రాలు కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయ‌ని చెప్ప‌వ‌చ్చు. నార‌ప్ప మిశ్ర‌మ స్పంద‌న మాత్ర‌మే తెచ్చుకుంటోంది. ప్రైమ్ కూడా తెలుగు సినిమాల‌కు భారీ ధ‌ర ఇచ్చి కొనుగోలు చేస్తోందికానీ దానికి పూర్తిగా వ‌ర్కౌట్ అవుతున్న‌ట్లు క‌నిపించ‌డంలేదు. అగ్ర క‌థానాయ‌కుడి సినిమా కాబ‌ట్టి చూసేవారు ఎక్కువుంటారేమోకానీ స్పంద‌న మాత్రం అనుకున్నంత రాక‌పోవ‌డం అటు నిర్మాత‌ల‌కు, న‌టీన‌టుల‌తోపాటు అమెజాన్ ప్రైమ్‌కు కూడా నిరాశ త‌ప్ప‌లేదు.

నెట్‌ఫ్లిక్స్ ను అమెజాన్‌ దాటేయాల‌ని?
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఓటీటీకి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ మొద‌టిస్థానంలో ఉన్న‌ప్ప‌టికీ అమెజాన్ మాత్రం భార‌త్‌లో భారీగా పెట్టుబ‌డులు పెడుతూ త‌న ప్రైమ్‌కు స‌బ్‌స్క్రైబ‌ర్స్ ను పెంచుకుంది. మంచి ధ‌ర‌తో కొత్త సినిమాల‌ను కొనుగోలుచేసి అవి ధియేట‌ర్‌లో విడుద‌లైన నెల‌, లేదంటే రెండునెల‌ల్లోపు వాటిని విడుద‌ల చేసేసి ధియేట‌ర్ల‌కు వెళ్ల‌కుండా ప్రైమ్‌లో వ‌స్తుందిగా.. అప్పుడు చూద్దాంలే అనేంత‌గా ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు అమెజాన్ తిప్పుకుంది. వెబ్‌సిరీస్‌ల‌తోపాటు సినిమాల‌పై కూడా భారీగా వెచ్చిస్తూ దేశంలోని ఓటీటీల్లో మొద‌టిస్థానంలో నిలిచింది అమెజాన్ ప్రైమ్‌. అయితే తెలుగు సినిమాల‌కు భారీధ‌ర ఇచ్చి తీసుకుంటున్న‌ప్ప‌టికీ స్పంద‌న రాక‌పోతుండ‌టంతో త‌ర్వాత ఏంచేస్తుంద‌నేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. నిర్మాత‌ల‌కు ఇచ్చే ధ‌ర‌ల‌ను అలాగే పొడిగిస్తుందా?  లేదంటే బ‌డ్జెట్ త‌గ్గిస్తుందా? అనేదానిపై ఒక స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.










మరింత సమాచారం తెలుసుకోండి:

tag