అత‌డికి వివాదాలేమీ కొత్త కాదు.. అత‌డికి కేసులేమీ కొత్త కాదు.. అత‌డికి శిక్ష‌లేమీ కొత్త కాదు.. అత‌నికి కొత్త‌వంటూ ఏవీ లేవు. అన్నీ పాత‌వే. ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు య‌జ‌మానిగా ఉన్న‌ప్పుడు బెట్టింగ్‌కు పాల్ప‌డ్డాడు.. దీంతోపాటు వెలుగులోకి రానివి ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు పోర్నోగ్ర‌ఫీ రాకెట్ న‌డిపిస్తున్నాడు. ఆయ‌న పేరు రాజ్‌కుంద్రా. శిల్పా శెట్టి భర్త ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. పోర్న్ సినిమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ కేసులు న‌మోద‌య్యాయి. వాటిని  మొబైల్ యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు. ముంబ‌యి క్రైమ్‌బ్రాంచ్ అత‌ని చేతికి అర‌దండాలు వేసింది. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. బ‌య‌ట‌కు పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఎంతోమంది న‌టీమ‌ణులు రాజ్‌కుంద్రా అరెస్ట్‌వ‌ల్ల న్యాయ‌మే జ‌రిగింద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఒక ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే న‌డుస్తోన్న రాకెట్‌?
రాజ్ ఒక ప్రణాళిక ప్రకారమే పోర్నోగ్రఫీ రాకెట్ నడిపిస్తున్నాడని ముంబ‌యి పోలీసులు వెల్ల‌డించారు. తన బంధువు ప్రదీప్‌ బక్షితో కలిసి రాజ్ కుంద్రా ఈ అశ్లీల చిత్రాల దందాను నిర్వహిస్తున్నట్లు వాట్సప్‌ గ్రూప్‌ చాటింగ్‌, ఈ-మెయిళ్ల ద్వారా తెలిసింద‌ని ముంబ‌యి పోలీసులు చెప్పారు. కెన్రిన్‌ అనే నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో హాట్‌షాట్స్‌ అనే యాప్‌ద్వారా వీటిని విడుద‌ల చేస్తున్నారు. ఇది బ్రిట‌న్‌లో ప్ర‌దీప్ బ‌క్షికి చెందిన‌ది. బాలీవుడ్‌లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే యువతుల‌ను ఈ అశ్లీల చిత్రాల్లో నటించ‌డానికి ఒప్పిస్తూ వీటిని తీస్తున్నారు. దీనికోసం ఏజెంట్ల ద్వారా కెన్రిన్ సంస్థ నిధులు సమకూర్చుతోంది.  కుంద్రా బృందం ఈ వీడియోలను కెన్రిన్‌కు ఓ అప్లికేషన్‌ ద్వారా పంపిస్తోంది. భారత చట్టాలను తప్పించుకోవ‌డానికే బ్రిటన్‌ నుంచి  అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ కంటెంట్‌ను చూడ‌డానికి సబ్‌స్క్రైబర్ల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కుంద్రా కోట్ల రూపాయలు ఆర్జించిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై ఓ బాధితురాలు ఫిబ్ర‌వ‌రిలో ఫిర్యాదు చేసింది. అప్ప‌టి నుంచి ద‌ర్యాప్తు జ‌రిపిన పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కు 11 మందిని అరెస్టు చేశారు. రూ.7.5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అత‌డి నేరం రుజువైతే ఏడు సంవ‌త్స‌రాల జైలుశిక్ష విధిస్తార‌ని పోలీసులు చెబుతున్నారు. స‌మాజంలో మంచి హోదా ఇచ్చిన‌ప్ప‌టికీ డ‌బ్బులపై ఉండే అత్యాశ మ‌నిషిని ఎలా పెడ‌దోవ ప‌ట్టిస్తుందో తెలుసుకునేందుకు రాజ్‌కుంద్రా కేసే ఒక ఉదాహ‌ర‌ణ‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag