ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ లో యువ హీరోల హవా ఎంతలా పెరిగి పోతుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమైన వారు సైతం తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఎంత గానో స్టార్డమ్ సంపాదించు కుంటున్నారు. ఇక ఇటీవల కాలం లో ఇలా నటనకు కేరాఫ్ అడ్రస్ గా మారి పోయి ఎన్నో విలక్షణమైన పాత్రల తో ప్రేక్షకులను అలరిస్తున్నారు యువ హీరోలు ఎంత మంది ఉన్నారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇలాంటి వారిలో ప్రస్తుతం యువ హీరో సత్యదేవ్ కూడా ఒకరు.


 ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేక పోయినప్పటికీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ లో మాత్రం వరస అవకాశాలు అందుకుంటున్నాడు సత్యదేవ్.  బ్లఫ్ మాస్టర్ అనే సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయ మయ్యాడు సత్యదేవ్. ఇక ఆ తర్వాత కూడా వరుసగా అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే కేవలం హీరోగా మాత్రమే కొనసాగకుండా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఏ పాత్రలో నటించిన పాత్రకి ప్రాణం పోస్తూ ఉంటాడు.  తన నటనతో ఇప్పటికే ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు సత్యదేవ్.



 అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటూ ఉన్న సత్యదేవ్ మరికొన్ని రోజుల్లో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో ఒక కీలక పాత్రలో సత్యదేవ్ అవకాశాన్ని దక్కించుకున్నాడట. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న రామసేతు అనే సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవలే క్లబ్ హౌస్ చాటింగ్లో చెప్పుకొచ్చాడు సత్యదేవ్. ఇక అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.  తమిళనాడులోని రామసేతు వంతెన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: