క‌రోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో థియేట‌ర్లు మూసి తిరిగి తెర‌చిన వెంట‌నే జ‌నాలు విర‌గ బ‌డి మ‌రీ థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూశారు. అప్పుడు పాత సినిమాలు కూడా రీ రిలీజ్ లతో ఆకట్టుకుని భారీ వ‌సూళ్లు సాధించాయి. అప్పుడు ప్ర‌భుత్వం కేవ‌లం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్ర‌మే థియేట‌ర్లు తెర‌చు కోవాల‌ని చెప్పినా చాలా వరకు ప్రయోజనం కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు కూడా చాలా వ‌ర‌కు సేఫ్ అయ్యాయి. క్రాక్ లాంటి సినిమాలు దుమ్ము రేపే వ‌సూళ్లు రాబ‌ట్టాయి. ఉప్పెన కూడా అంతే ? అయితే ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ తర్వాత జనాలు బాగా మారిపోయిన వాతావ‌ర‌ణ‌మే ఉంది. జ‌నాల మూడ్ మారిపోయింది.

బ‌తికుంటే బ‌లుసు ఆకు కూర అయినా తినొచ్చు కాని... అన‌వ‌స‌రంగా జ‌నాలు ఎక్కువుగా వ‌చ్చే సినిమా థియేట‌ర్ల‌కు వెళ్లి మూడు గంట‌ల వినోదం కోసం ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌ద్దురో బాబోయ్ అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ లో థియేట‌ర్లు ఓపెన్ అవుతున్నా రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు ఇష్టంగా లేరు... థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూసేందుకు ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తితో లేరు. కన్నడ సినీ ఇండస్ట్రీ పరిస్థితి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పాలి. అక్క‌డ 50  శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు తిరిగి ఓపెన్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

తొలి రోజు కేవ‌లం 10 శాతం థియేట‌ర్లు మాత్ర‌మే ఓపెన్ చేశారు. బెంగ‌ళూరులోనూ 20 థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. అయితే కొన్ని చోట్ల ఒక్క టిక్కెట్ మాత్ర‌మే తెగింద‌ట‌. దీంతో ఈ తెర‌చిన థియేట‌ర్లు కూడా సాయంత్రానికే స‌గం మూసేశారు. ఇది ప్ర‌స్తుత ప‌రిస్థితి. ఇక ఏపీ, తెలంగాణ‌లో ఈ నెల 23 నుంచి తెలంగాణ‌లో థియేట‌ర్లు పునః ప్రారంభిస్తున్నారు. అయితే ఏపీలో ఇప్పుడున్న రేట్లకి సినిమా హాళ్లు తెరవడం ఏమాత్రం సాధ్యం కాదని ఇండ‌స్ట్రీ డిసైడ్ అయ్యింది. ఇప్పుడు అక్క‌డ టిక్కెట్ రేట్లు రు. 5 నుంచి ఉన్నాయి. దీంతో అస‌లు ఇక్క‌డ సినిమా రిలీజ్‌లు ఎప్పుడో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ?


మరింత సమాచారం తెలుసుకోండి: