టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు క్లాష్ అవడం సహజమైన విషయమే. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకే సీజన్ లో ఒకే రోజు విడుదల అయిన సందర్భాలు గతంలో చాలా చూశాం. హిట్ లు ఫ్లాప్ ల సంగతి పక్కన పెడితే ఆ విధంగా ఒకే రోజు పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం వల్ల చాలా సార్లు నష్టమే ఎదుర్కొంది సినిమా పరిశ్రమ. అందుకే స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కాకుండా ఒకే సీజన్లో విడుదల కాకుండా చూసుకుంటూ ఉంటారు సినిమా పెద్దలు. అలా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకి పెద్ద హీరోల సినిమాల గండం ఎదురు పడుతుంది.

ముఖ్యంగా మెగా హీరోల సినిమాలే ఆయన సినిమాను విడుదల చేయడానికి ఎదురు పడుతున్నాయి. అల్లుఅర్జున్ పోయి పోయి మెగా హీరోలతో పోటీ పడుతుండటం మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చదు ఎందుకంటే ఆయన కూడా మెగా హీరో కాబట్టి. ఇతర హీరోలతో పోటీ అంటే ఎంతో కొంత ఆసక్తి నెలకొంటుంది కానీ మెగా హీరోలతో పోటీ అంటే తన తన కంట్లో తానే పొడుచుకున్నట్లే అని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్. గతంలో చాలాసార్లు తన సినిమాను మెగా హీరోలకు పోటీగా తీసుకు రాకుండా వెనక్కి జరిగాడు అల్లు అర్జున్. 

ఇప్పుడు కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమాకి మెగాహీరోల సరికొత్త చిత్రాలు అడ్డు తగులుతున్నాయి. షూటింగ్ పూర్తి కావడం తో పుష్ప సినిమా విడుదల చేయాలని భావిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ లో విడుదల చేయాలని చూస్తుండగా ఆ టైంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవుతుంది. దానికి ముందు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రానుండడం తో తన సినిమాను పోస్ట్ ఫోన్ చేశాడు. సంక్రాంతికి వద్దామా అంటే పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదల కాబోతోంది. ఈ విధంగా మెగా హీరోలకే తన సినిమాలకు అడ్డుతగులుతున్నారు పరోక్షంగా.

మరింత సమాచారం తెలుసుకోండి: