టాలీవుడ్ లో దిగ్దర్శకుడిగా దాసరి నారాయణ రావు ఉన్నారు. ఆయన తీసినన్ని సినిమాలు, చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేసి ఉండరు. ఒక టైటిల్ నుంచి సినిమా తీయడం ఆయనకే సాధ్యం. ఆలాగే హీరోల ఇమేజ్ తో సినిమాలు తీయాలన్నా కూడా ఆయన పేరే ముందు చెప్పుకోవాలి.

ఇదిలా ఉంటే దాసరి అందరి హీరోలతో సినిమాలు చేశారు. అగ్ర నటులు, ఎన్టీయార్, ఏయన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు తరువాత క్రిష్ణంరాజు, మోహన్ బాబులతో కూడా ఎక్కువగా సినిమాలు చేశారు. ఇక చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున వెంకటేష్ లతో కూడా సినిమాలు చేసిన ఘనత ఆయనదే.

ఇదిలా ఉంటే దాసరి ఉడుకునెత్తురు అని ఒక పవర్ ఫుల్ టైటిల్ ని తొంబై దశకంలో అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ అనుకున్నపుడు మొదట హీరోగా దాసరి ప్రకటించినది అక్కినేని నాగార్జుననే. ఇక  నాగ్ తో అప్పటికే మజ్ఞూ మూవీని దాసరి తీశారు. ఆ తరువాత రామ్ గోపాల వర్మ శివ మూవీ తీసి నాగ్ లో ఫైర్ ని బయటపెట్టాడు. దాంతో ఆ కోణంలో మరో మూవీగా దాసరి ఉడుకు నెత్తుకు అనుకున్నారు. కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు.

ఆ తరువాత కొన్నేళ్ళకు మళ్ళీ అదే టైటిల్ తో బాలక్రిష్ణతో సినిమా తీయాలనుకున్నారు. బాలయ్య అంటేనే ఎమోషనల్ పాత్రలకు పెట్టింది పేరు. దాంతో బాలయ్యతో తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అని అభిమానులు కూడా ఆశించారు. కానీ అది కూడా సాధ్యపడలేదు. అలా దాసరి పవర్ ఫుల్ టైటిల్ ఉడుకు నెత్తురు మాత్రం ఎప్పటికీ సినిమాగా రాకుండా అలాగే ఉండిపోయింది. ఇప్పటికైనా ఎవరైనా వాడుకుంటే అది మంచి టైటిలే అవుతుంది. చూడాలి మరి ఆ టైటిల్ ని ఫ్యూచర్ లో  ఎవరు టచ్ చేసి మూవీ తీస్తారో. ఏది ఏమైనా దాసరి ఐడియాలజీ ప్రకారం ముందు టైటిల్ అనుకుని తీసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి కూడా.




మరింత సమాచారం తెలుసుకోండి: