టాలీవుడ్ కి ఫుల్ గ్లామర్ కావాలి. గతంలో అయితే ఒక సినిమాలో ఒకరే హీరోయిన్. ఇపుడు ఇద్దరు ముగ్గురు ఉన్నా సరిపోవడంలేదు. దాంతో పాటు ఐటెం సాంగ్ కూడా కంపల్సరీ చేశారు. దాంతో ఎక్కడ లేని గ్లామర్ తెచ్చినా కూడా అసలు చాల‌డంలేదు. ఇక బాలీవుడ్ ఉంచి మొదలుపెడితే అందరు హీరోయిన్ల చూపూ టాలీవుడ్ మీదనే ఉంది.

ఇక్కడ మంచి రెమ్యునరేషన్. పక్కాగా షూటింగ్ జరుగుతుంది. దాంతో పాటు గ్లామర్ బాగా ఎలివేట్ చేస్తారు ఇలాంటి కారణాలతో టాలీవుడ్ మీదకు అంతా దండెత్తుతున్నారు. ముంబై భామలు ఒక వైపు టాలీవుడ్ లోకి వెల్లువలా వస్తున్నా కూడా కోలీవుడ్, కన్నడ భామలు, కేరళ కుట్టీలు కూడ టాలీవుడ్ లో తమ ప్లేస్ వెతుక్కుంటున్నారు.

అయితే టాలీవుడ్ లో ఇపుడు ఎక్కువగా కన్నడ భామలే  హవా అంటున్నారు. కన్నడ కస్తూరీలతో టాలీవుడ్ గుభాళిస్తోంది అంటున్నారు. అందచందాలతోనే కాదు, అభినయం విషయంలో కూడా వారు పోటీ పడుతున్నారు. దాంతో అవకాశాలు వారికే ఎక్కువగా వస్తున్నాయట. ఈ రేసులో కేరళ కుట్టీలు పూర్తిగా వెనకబడిపోతున్నారు అంటున్నారు. మళయాళీ భామలకు టాలీవుడ్ లో సరిన సక్సెస్ లేకుండా పోయింది అంటున్నారు.

కేరళ బ్యూటీ  అనుప‌మ పరమేశ్వరన్ అందంగా ఉంటుంది. చక్కని నటన ఉంది. కానీ టాలీవుడ్ లో ఆమెకు సరైన అవకాశాలు అయితే ఇప్పటిదాకా లేవు. ఆమె ఇన్నాళ్ళు అయినా స్టార్ హీరోయిన్ రేసులో కూడా లేకుండా పోయింది. ఇక మరో హీరోయిన్ నివేదా థామస్ తీసుకున్నా ఇంతే. ఈ అమ్మడుకు కూడా అందం, అభినయం ఉన్నా కూడా కన్నడ హీరోయిన్లతో పోటీ పడలేకపోతోంది. ఇక అను ఇమాన్యూల్ కూడా ఎక్కడికో వెళ్తుంది అని అంతా అనుకున్నారు. మొదట్లో ఆమెకు మంచి అవకాశాలే వచ్చాయి. కానీ ఆమె ఆ ఊపు నిలబెట్టుకోలేకపోయింది. ఇక కన్నడ భామలను తీసుకుంటే నాటి సౌందర్య, అనుష్క శెట్టి నుంచి నేటి పూజా హెగ్డే, రష్మిక వంటి వారు స్టార్లుగా మారి టాలీవుడ్ ని శాసిస్తున్నారు. లేటెస్ట్ గా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కూడా టాలీవుడ్ లో మంచి అవకాశాలు పట్టుకుపోతోంది. మరి కేరళ కుట్టీలు ఎందుకు వెనకబడుతున్నారు అన్నది వారే ఆత్మపరిశీలన చేసుకోవాలేమో.





మరింత సమాచారం తెలుసుకోండి: