టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలు చేసి పెద్ద స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు.ఇక నాగార్జున అంటే అందానికి కేరాఫ్ అడ్రెస్.ఇక ఈమధ్య అంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల హవా నడుస్తుంది కాని 80,90 లలో నాగార్జునకి వున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఇక అప్పట్లో నాగార్జున అమ్మాయిలు కలల రాకుమారుడు. అప్పుడు తెలుగులో చిరంజీవి హవా కొనసాగుతున్నప్పుడు గట్టి పోటీ ఇచ్చిన మొట్టమొదటి హీరో నాగార్జున. అప్పట్లో చిరంజీవికి బీభత్సమైన క్రేజ్ వుంది. ఇక చిరంజీవికి పోటీగా ఈ హీరో నిలిచేవాడు కాదు. అంత పెద్ద స్టార్ కి నాగార్జున గట్టి పోటీ ఇచ్చి టాలీవుడ్ కింగ్ గా నిలిచాడు. ఒక దశలో నాగ్ చిరంజీవిని దాటేస్తాడేమో అనుకున్నారు. ఇక అంతేకాదు "గీతాంజలి","శివ" సినిమాలతో టాలీవుడ్ రికార్డులు తిరగరాసాడు. ఇక "శివ" సినిమాతో ఒక్క టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాడు. ఇక ఆ సినిమాతో నాగ్ తమిళ్ లో రజినీకాంత్ రికార్డులనే బద్దలు కొట్టాడంటే నాగ్ హవా అప్పట్లో ఏ రేంజిలో వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక అప్పట్లో సౌత్ ఇండియాలో రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవిల తరువాత నాగార్జున పెద్ద స్టార్ హీరోగా పేరు సంపాదించాడు. అయితే ఒక్క సినిమా ప్లాప్ వల్ల నాగ్ నెంబర్ 1 స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఒకవేళ ఆ సినిమా కనుక హిట్ అయ్యుంటే నాగ్ దేశంలోనే నెంబర్ 1 హీరో అయ్యుండేవాడట.ఇక సినిమా మరేదో కాదు.
 


అదే "రక్షకుడు".90 లలో అప్పటిదాకా దేశంలో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం. పాన్ ఇండియా  సినిమాగా 1997లో తెరకెక్కింది. ప్రవీణ్ గాంధీ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు.అప్పట్లో సౌత్ ఇండియాలో "జెంటిల్మెన్", "ప్రేమికుడు", "ప్రేమదేశం" లాంటి సినిమాలు నిర్మించి విజువల్ ట్రీట్ చూపించిన నిర్మాత కుంజుమోన్ ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించాడు. ఇక ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించగా, విశ్వ సుందరి సుస్మిత సేన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు హైప్ అనే పదానికి కొత్త అర్ధం చెప్పింది. అప్పట్లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక సినిమా ట్రైలర్, పాటలు ఒక రేంజిలో హిట్ అయ్యాయి. అప్పట్లోనే ఈ సినిమా ఇండియాలో ఏ సినిమా కూడా బిజినెస్ చెయ్యని విధంగా ఏకంగా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక అంతా రివర్స్ అయ్యింది. మొదటి మూడు రోజులు హౌస్ ఫుల్ అయిన థియేటర్లు తరువాత ఖాళీ అయ్యాయి. సినిమా ప్లాప్ అయ్యింది.యాక్షన్ పరంగా, నాగార్జున పెర్ఫార్మన్స్ పరంగా సినిమా ఒక రేంజిలో వున్న భారీ హైప్ వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.విడుదలైన వారం రోజులోనే ఈ సినిమా రెండు సిటీ కేబుల్ ఛానల్స్ లో టెలికాస్ట్ అయ్యిందంటే సినిమా ఫలితం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.అయినా కాని ప్లాప్ టాక్ తో 23 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.ఒకవేళ ఈ సినిమా హిట్ అయ్యుంటే నాగార్జున దేశంలోనే నెంబర్ వన్ హీరో అయ్యుండేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: