టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అగ్ర హీరోల సినిమాలకి డాన్స్ కంపోస్ చేసి.. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు.చిన్న హీరోల దగ్గర్నుంచి స్టార్ హీరోల వరకు శేఖర్ మాస్టర్ స్టెప్స్ ని ప్రతీ ఒక్కరూ ఫాలో అవుతుంటారు.అటు ఆడియన్స్ లో కూడా శేఖర్ మాస్టర్ డాన్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు.ఇక ఈ మధ్య కాలంలో బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు శేఖర్ మాస్టర్.ఢీ, జబర్దస్త్, కామెడీ స్టార్స్... ఇలా వరుస షోలలో జడ్జి గా వ్యవహరిస్తూ మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ అభిమానులకు గూగుల్ షాక్ ఇచ్చింది.

గూగుల్ సెర్చ్ ఇంజన్ శేఖర్ మాస్టర్ విషయంలో ఒక పెద్ద పొరపాటు చేసింది. ఇక గతంలో కూడా ఎంతో మంది సెలబ్రిటీల విషయంలో గూగుల్ కొన్ని మిస్టేక్స్ చేసిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు తాజాగా శేఖర్ మాస్టర్ విషయంలో గూగుల్ చేసిన పొరపాటుకి ఆయన అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ ఆ పొరపాటు ఏంటంటే.."గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేస్తే..ఆయన ఫోటోని చూపిస్తుంది.అయితే ఇక్కడ జరిగిన తప్పేంటంటే..ఆయనకు సంబంధించిన పూర్తి బయోడేటాను వేరే వారిది చూపిస్తుంది.అందులో శేఖర్ మాస్టర్ జననం, మరణం తేదీలను కూడా చూపిస్తుంది.


ప్రస్తుతం బ్రతికి ఉన్న శేఖర్ మాస్టర్ ని 2003 లో మరణించినట్లుగా చూపిస్తోంది గూగుల్.దీంతో గూగుల్ పై శేఖర్ మాస్టర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అయితే తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ శేఖర్ కి సంబంధించిన బయోడేటాను శేఖర్ మాస్టర్ ది అంటూ చూపిస్తోంది.ఇక మాస్టర్ శేఖర్ తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు.అక్కా తమ్ముడు సినిమాలో తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత తమ్ముడిగా నటించాడు.సినీ ఇండస్ట్రీలో ఇతన్ని మాస్టర్ శేఖర్ అని పిలిచేవారు.అలా శేఖర్ మాస్టర్.. మాస్టర్ శేఖర్ అనే పేర్లు ఒకేలా ఉండటంతో దివంగత నటుడు మాస్టర్ శేఖర్ బయోడేటాను..కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ బయోడేటాగా చూపిస్తుంది గూగుల్.ఇలా గూగుల్ చేసిన పొరపాటుకి ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: