బాహుబలి లాంటి అంతర్జాతీయ సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం RRR. rrr సినిమాపై  భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి లాంటి భారీ విజయం తరువాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడో అని అందరు ఎదురుచూశారు. రాజమౌళి తన తదుపరి చిత్రం rrr అని ప్రకటించగానే ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్నారు అని తెలియగానే అంచనాలు  ఎక్కువ అయ్యాయి.ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తుండటంతో  ఆ సినిమా ఏవిధంగా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి ఇది ఒక పీరియాడిక్ మూవీ అని చెప్పడం జరిగింది. ఏ సినిమాలో రాంచరణ్ అల్లూరిసీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరంభీమ్ గా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ  సినిమా షూటింగ్  శెరవేగంగా జరుగుతుంది. రెండు పాటలు మినహా టాకీ  పార్ట్ మొత్తం పూర్తి అయింది.ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్  చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది.RRR సినిమాపై  అంచనాలు పెంచడానికి ఈ హీరోల బర్త్ డే రోజున ఫస్ట్ లుక్ విడుదల చేసి సినిమాపై  అంచనాలు పెంచేసాడు.ప్రతి పండుగకు  చిన్న చిన్న అప్డేట్ ఇస్తూ చిత్రంపై హైప్ తీసుకొని వచ్చాడు.ఆ తరువాత చిత్రంలో చిత్ర  యూనిట్ ఎంత కష్టపడిందో ఒక మేకింగ్ వీడియో విడుదల చేసింది.ఈ మేకింగ్ వీడియోలో చిత్రంలో పోరాట సన్నివేశాలు ఏ విధంగా చిత్రించారో కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఈ మేకింగ్ వీడియో సినిమా ఎలా ఉండబోతుందో చూపించింది.అందిరిలో ఆసక్తి పెరిగింది.లేటెస్ట్ గా ఈసిత్రం నుంచి  మరొక ఆసక్తికర విషయం తెలిసింది. అది ఏమిటంటే  ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ ను షూట్  చేస్తున్నారంట.మగధీర సినిమా ఎండింగ్ లో ప్రమోషనల్ సాంగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.ఈ సాంగ్ షూటింగ్ కోసం ఇప్పటికే కీరవాణి మంచి సంగీతం అందించాదట. ఇదిలా ఉంటే ఈ ప్రమోషనల్ సాంగ్ తమిళ్ వెర్షన్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చిందెయ్యబోతున్నాడట.త్వరలోనే ఈ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేయబోతున్నారట.  ఆ ప్రమోషనల్  సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: