క్రిష్ డైరక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు. పిరియాడికల్ మూఒవీగా వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాన్ బందిపోటు దొంగగా కనిపిస్తారని అంటున్నారు. సినిమాలో పవర్ స్టార్ ఒకటి రెండు కాదు ఏకంగా 3 పాత్రల్లో నటిస్తారని అంటున్నారు. పవన్ కెరియర్ లో మొదటిసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. సినిమాలో పవన్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతారని అంటున్నారు.

3 పాత్రలతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా సినిమా ఉంటుందని టాక్. క్రిష్ ఈ సినిమాను చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. పవన్ కెరియర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా రాబోతుందని తెలుస్తుంది. సినిమాలో పవన్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉంటాడని టాక్. ఈ సినిమా కోసం పవన్ స్పెషల్ గా కర్రసాము.. కత్తి యుద్ధం నేర్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబో క్రేజీ మూవీగా హరి హర వీరమల్లు వస్తుంది. ఈ సినిమా తప్పకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. హరి హర వీరమల్లుతో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం రీమేక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా దగ్గుబాటి యువ హీరో రానా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత పవర్ స్టార్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమాతో పాటుగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. 2023 వరకు తన డేట్స్ ఫిల్ చేసుకున్నాడు పవర్ స్టార్.


మరింత సమాచారం తెలుసుకోండి: