సినీ ఇండస్ట్రీలో వెండితెరపై, బుల్లితెరపై కూడా రీ ఎంట్రీ ఇచ్చిన అలనాటి తారలు చాలామంది ఉన్నారు. ఇక అందులో రోజా కూడా ఒకరు. ఈమె నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక అంతే కాకుండా ఇటు రాజకీయంగా కూడా తనదైన శైలిలో నెట్టుకొస్తోంది రోజా. ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి ప్రముఖ ఛానల్ లో  జడ్జి గా వ్యవహరిస్తోంది. అయితే రోజా ఆస్తి విలువ ఎంతో ఒకసారి తెలుసుకుందాం.


ప్రస్తుతం రోజా నగరి ఎమ్మెల్యే గా కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే రోజా సినిమాల్లో కూడా ఒక మంచి నటిగా గుర్తింపు పొందింది.ఇక బుల్లితెరపై కూడా తనకంటూ ప్రేక్షకులు సంపాదించుకుంది రోజా. అయితే రోజా కి ఉన్న ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవుతారు


తన పేరు మీద మొత్తం రూ.7.3 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో స్థిరాస్తులు రూ. 4 కోట్ల 24 లక్షలు ఉన్నట్లు తెలిపింది. ఇకపోతే రోజా కొన్ని ఆస్తుల విలువ 2 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఇక తన కూతురు, కొడుకు పేరు మీద రూ.50 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా తన దగ్గర కోటి రూపాయలు విలువ చేసే ఒక మహేంద్ర, హోండా స్పెండర్, మహేంద్ర స్కార్పియో, ఇన్నోవా క్రిస్ట్ కాక పలు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక తన భర్త సెల్వమణి పై ఎలాంటి ఆస్తులు లేవు.  కేవలం రూ.58 లక్షలు మాత్రమే ఉందట.


అంతేకాదు ఈమె ఒక షో కి సుమారుగా లక్షల్లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. అటు రాజకీయ పరంగా కూడా ప్రజలకు సేవలు చేస్తూ తనదైన రీతిలో ముందుకు సాగుతోంది రోజా. ఇక ప్రేక్షకులందరూ కు ఎప్పుడు చేరువలో ఉండే నటి కేవలం రోజా అని మాత్రం చెప్పవచ్చు. ఇక ఈమె ఇలాగే ఎన్నో మంచి పనులు చేస్తూ కొనసాగాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: