అశ్లీల వీడియోలు రూపొందించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరచగా జూలై 20 వరకు కోర్టు అతనికి పోలీస్ కస్టడీ విధించింది. 45 ఏళ్ల కుంద్రా మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పోలీసులు అతన్ని రిమాండ్ కు తరలించారు. అతనిపై ఇప్పటికే భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం కింద పలు కేసు నమోదు చేశారు. అశ్లీల వీడియోలు చేసిన ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కుంద్రాకు ఎలాంటి శిక్ష పడుతుందని విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరైతే కుంద్రా చట్టరీత్యా ఏ శిక్ష పడుతుందనే విషయాలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం భారతదేశంలో అశ్లీలతపై కఠిన శిక్ష పడుతుందని చెబుతున్నారు. ఇండియాలో సినిమా, సీరియల్స్, సోషల్ మీడియా వంటి సామాజిక మీడియాలో అశ్లీలతను నియంత్రించేందుకు చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. 

ఇండియన్ పీనల్ కోడ్ కింద స్పెషల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇన్ డీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్స్ యాక్ట్ అండ్ యంగ్ పర్సన్యాక్ట్ ఐపిసి ఐటి యాక్ట్ 2000 చట్టాన్ని అశ్లీల వీడియోలపై విధించారు. ఈ యాక్ట్ కింద అశ్లీల వీడియోలు ప్రమోట్ చేసినా, కంటెంట్ అప్లోడ్ చేసినా, ఆ కంటెంట్ డౌన్లోడ్ చేసుకునా చట్టరీత్యా శిక్షార్హులు. ఈ యాక్ట్ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష గానీ, లేదా ఐదు లక్షల జరిమానా గాని, రెండూ కలిపి విధించే అవకాశం లేకపోలేదు.  ప్రస్తుతం కుంద్రాపై భారత శిక్షాస్మృతిలోని 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశం), 292, 293 (అశ్లీల మరియు అసభ్య ప్రకటనలు ప్రదర్శించడం), ఐటీ చట్టంలోని 67, 67ఏ  సెక్షన్లు (మహిళా అసభ్య ప్రాతినిథ్యం) కింద కేసులు నమోదు చేశారు. పోలీస్ ఆరోపణలు నిజమైతే ఆయన గట్టిగానే శిక్ష పడుతుంది. రాజ్ కుంద్రా పలువురు మోడల్స్, సినీ తారలను అశ్లీల వీడియోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేశారని వారు వెల్లడించారు. కేసు తీవ్రత దృష్ట్యా కనీసం మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: