ప్రపంచ వ్యాప్తంగా ప్రతి తెలుగు వ్యక్తి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే రాజమౌళిమూవీ మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ మూవీ చూసే సగటు ప్రేక్షకుడుని  అలనాటి స్వాతంత్రోద్యమ కాలంలోకి తీసుకు వెళ్ళిపోవడానికి సర్వం సిద్ధం చేస్తున్నాడు.


మూవీ తరువాత రాజమౌళి మహేష్ తో మరో భారీ మూవీని చేయబోతున్నాడు. ఇప్పటికే ఈమూవీ కథ పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమూవీ కథ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  


ఇప్పటికే బ్యాక్ డ్రాప్ గురించి హిట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు మరో అడుగు వేసాడు. రాజమౌళి మహేష్ తో చేయబోయే సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడుతుందని ఇదొక జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉంటుందని హింట్ ఇచ్చాడు. గతేడాది లాక్ డౌన్ సమయంలో ఆఫ్రికా నేపథ్యంలో ఒక అడ్వెంచరస్ మూవీ కావాలని రాజమౌళి తనతో చెప్పాడని అప్పటి విషయాలను విజయేంద్ర ప్రసాద్ గుర్తుకు చేసుకున్నాడు. అయితే ఈమూవీ కథ తాను ఇంకా పూర్తి చేయలేదని ప్రస్తుతానికి ఈ ఐడియా కథను డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెపుతూ దీనికోసం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రచనల పై తాను  రీసెర్చ్ చేస్తున్నట్లు మరో కొత్త లీక్ ఇచ్చాడు.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ 2022 లో సెట్స్ పైకి వెళ్ళి ఆతరువాత కనీసం ఒక సంవత్సరం గ్యాప్ తో 2023లో ఈమూవీ విడుదల అయ్యే అవకాశం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి యాక్షన్ ప్లాన్ ఎప్పుడు అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. దీనితో ఈమూవీ మరింత ఆలస్యం అయిన ఆశ్చర్యం లేదు అన్న మాటలు ఇండస్ట్రీ వర్గాలలో సందడి చేస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: