టాలీవుడ్ హీరోయిన్ మెహరిన్ ఇటీవలే భవ్య భిష్ణోయ్ తో జరిగిన తన ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుని పెళ్లిని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ తమ ఎంగేజ్ మెంట్ ను వెనక్కి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముందుగా మెహరీన్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించగా ఆ తర్వాత భవ్య కూడా ఈ విషయాన్ని లేఖ ద్వారా వెల్లడించాడు. ఇద్దరి భవిష్యత్తు కోసం ఒకరికొకరు ఆల్ ద బెస్ట్ కూడా చెప్పుకున్నారు. 

టాలీవుడ్ కి నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో పరిచయమైన మెహరీన్ ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా సినిమా ప్రయత్నాలు చేసింది కానీ ఆమె బొద్దుగా ఉండటంతో ఆమెను స్క్రీన్ పైన చూడడానికి పెద్దగా ఇష్టపడలేదు ప్రేక్షకులు.  కానీ తాను స్టార్ హీరోయిన్ కావాలన్న కోరిక వెనక్కి తగ్గనివ్వలేదు. సన్నగా మారి అభిమానుల కోసం సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది ఆ విధంగా ఆమెకు ఎఫ్2 సినిమా ద్వారా మంచి బ్రేక్ వచ్చింది ఈ సినిమాలో ఆమె హనీ గా నటించగా ఆమె నటనకు, అందాలకు ఫిదా అయిపోయారు. 

ఈ నేపథ్యంలో తెలుగులో మంచి అవకాశాలు అందుకోబోతుండగా ఆమె తన ఎంగేజ్మెంట్ చేసుకొని ఒక్కసారిగా అభిమానులను ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. లాక్ డౌన్ సమయంలో ఎంగేజ్మెంట్ అయినట్లు వెల్లడించగా మరి కొద్ది రోజులకే అది క్యాన్సల్ చేసుకున్నట్లు చెప్పి ఉత్సాహ పరిచింది. ప్రస్తుతం ఆమె f3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు అందుకు పోతుంది. తెలుగు లోనే కాకుండా తమిళంలో కూడా ఆమెకు వరుస అవకాశాలు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత అవకాశాల వలస ఎక్కువ అవుతుంది. దానికి తగ్గట్లుగానే ఆమె ఇప్పుడు సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: