టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ కొనసాగుతుంది. అదే ఒక సినిమాను రెండు లేదా మూడు భాగాలుగా నిర్మించడం. గతంలో ఎప్పుడూ లేని విధంగా బాహుబలి సినిమాను రెండు భాగాలుగా విభజించి విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి. తొలుత ఈ రకమైన అభిప్రాయం ఎవరికీ లేనప్పటికీ బాహుబలి సినిమాను ఒక పార్ట్ లో కాకుండా రెండు భాగాలుగా విభజించి చూపిస్తేనే ప్రేక్షకులకు బాగా అర్థం అవుతుందని మేకర్స్ భావించగా ఆ విధంగా సినిమాను తెరకెక్కించి రాజమౌళి రెండు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందుకున్నాడు. 

ఆ తరువాత ఈ విధమైన ట్రెండ్ టాలీవుడ్ లో కొనసాగుతూ వస్తుంది. రెండు భాగాలుగా సినిమాలు చేసి రెండు సార్లు ఒక సినిమాకి భారీ కలెక్షన్లు అందుకోవడం బాగుంటుందని నిర్మాతలు భావించి ఈ రకమైన అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భాగాలుగా ప్రేక్షకులను కనువిందు చేయనున్న సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలన్నది దర్శకుడు సుకుమార్ ఆలోచన. షూటింగ్ పూర్తయ్యే వరకు సుకుమార్ కు పుష్ప సినిమాను రెండు భాగాలుగా చేయాలని ఆలోచన రాలేదు కానీ షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా నిడివి ఎక్కువ కావడంతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే తప్పేంటి అని ఆలోచిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు గానీ పుష్ప 1 సినిమాను త్వరలోనే విడుదల చేస్తారని పుష్ప 2 సినిమా ఆ తర్వాత విడుదల చేస్తానని చెబుతున్నారు.ఇక యశ్ నటించిన కే జి ఎఫ్ సినిమా కొనసాగింపుగా తెరకెక్కిన కే జి ఎఫ్ పార్ట్ 2 సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇక తమిళ కథానాయకుడు విక్రమ్ నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమా కూడా రెండు భాగాలుగా విడుదలవుతుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేయబోయే సినిమా రెండు భాగాలుగా చేస్తారట. శ్రీకాంత్ అడ్డాల అన్నాయ్ పేరుతో మూడు భాగాల చిత్రం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర కూడా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: