బాలీవుడ్‌లో ఆ ఇద్ద‌రు హీరోలు 16 సంవ‌త్సరాలు మాట్లాడుకోలేదు.. అయితే మాములుగా సినిమా ఇండస్ట్రీలో హీరోల మద్య ఇగో చాలా స‌ర్వ‌సాధార‌ణ‌మే.. పైకి మాములుగా ఉన్న ఆధిప‌త్యం కోసం పాటు ప‌డుతూనే ఉంటారు. దీనికి ఏ ప‌రిశ్ర‌మ అయినా అతీతం కాదు. ఈ కోవ‌లోకే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌.. హీరో స‌న్నిడియోల్ కూడా ఉన్నారు. వీళ్ల ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద‌గా గొడ‌వ లేదు. అయినా షారుఖ్ ఖాన్‌తో మాట్లాడ‌డానికి స‌న్ని డియోల్ స‌ముఖ‌త వ్య‌క్తం చేయ‌లేద‌ట‌. అలా దాదాపు 16 ఏళ్ల పాటు మాట్లాడుకోకుండా ఉన్నార‌ట‌. కొన్ని సార్లు ఎదురు ప‌డ్డాగాని ఒకరిని ఒక‌రు ప‌ల‌క‌రించుకోద‌ట‌.

   ఈ ఇద్ద‌రి కాంబినేష‌న‌ల్ 1993లో డ‌ర్ సినిమా విడుద‌ల‌యింది. ఈ సినిమాలో హీరోగా డ‌యోల్‌, విల‌న్ పాత్ర‌లో షారుఖ్ న‌టించాడు. అప్ప‌డు డ‌ర్ చిత్రం మంచి సూప‌ర్ హిట్‌గా నిలిచింది. హీరోగా న‌టించిన స‌న్నీ డియోల్ కంటే విల‌న్‌గా న‌టించిన షారుఖ్ కే మంచి పేరు సంపాదించాడు. డ‌ర్ సినిమాలో వీరిద్ద‌రి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి.

 య‌శ్ చోప్రా ద‌ర్శ‌కత్వం వ‌హించిన డ‌ర్ సినిమాలో హీరో పాత్ర కంటే విల‌న్ పాత్ర‌కు అధిక ప్రాముఖ్య‌త ఉంది. క‌థతో పాటు పాత్ర‌లో కూడా హీరో కంటే విల‌న్ పాత్ర‌కు ప్రియారిటి ఎక్కువ ఉండ‌డంతో సినిమా విడుద‌ల అనంత‌రం స‌న్నీ డియోల్ కంటే షారుఖ్ ఖాన్‌కు అధిక స్టార్ డ‌మ్ వ‌చ్చింది.  అప్ప‌టికే స్టార్ గా ఉన్న స‌న్నీ డియోల్ డ‌ర్ సినిమాతో కాస్త డ‌ల్ అయ్యాడు. షారుఖ్ మాత్రం ఇదే సినిమాతో స్టార్‌గా పేరు తెచ్చుకున్ర‌నాడు.

  ఈ సినిమా క్లైమాక్స్‌లో ఆర్మీ ఆఫీస‌ర్‌గా ఉన్న స‌న్నీడియోల్‌ను విల‌న్‌గా ఉన్న షారుఖ్ కొట్టే స‌న్నివేశం ఉంది. అయితే ఈ స‌న్నివేశంపై స‌న్నీ డియోల్ ఆర్మీ ఆఫీస‌ర్‌ను ఒక విల‌న్ ఎలా కొడుతాడ‌ని ద‌ర్శ‌కుడు య‌శ్ చోప్రాతో గొడ‌వ కూడా ప‌డ్డాడ‌ట‌. క్లైమాక్స్ మార్చాలంటూ స‌న్నీ ద‌ర్శ‌కుడితో ప‌ట్టుబ‌ట్టాడని తెలిసింది.



 అయినా అదే సీన్‌ను షారుఖ్‌కు అనుకూలంగా చేశాడ‌ని కోసంతో వారిరువురి మ‌ధ్య ప‌డ‌లేద‌ని బీ టౌన్ వ‌ర్గాలు భావించాయి.  ఈ సంఘ‌ట‌న నుంచి స‌న్ని ద‌ర్శ‌కుడు, షారుఖ్‌ల‌తో గొడ‌వ లేకున్నా మాట్లాడ‌లేదు. ఇదే విష‌యాన్ని స‌న్నీడియోల్ ఓ ఇంట‌ర్వూలో చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం వీరిరువురు కాస్త సంఖ్య‌త‌గానే ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: