తెలుగు ప్రముఖ దర్శకులలో ఒకరైన రవిబాబు 'అల్లరి' సినిమాతో ఒక మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అమ్మాయిలు అబ్బాయిలు , నచ్చావులే సినిమాలతో తెలుగులో ఒక మంచి టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ప్రస్తుతం ఈ డైరెక్టర్ వరస ఫ్లాపులతో వెనుకబడి పోయాడు. ఈ దర్శకుడి పనితనం మీద లడ్డు బాబు సినిమా ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. రవిబాబు అనేవాడు అసలు దర్శకుడే కాదు.


 మొదట లడ్డు బాబు కథ వినిపించిన నప్పుడే ఈ కథ తెలుగు లోనే కాదు ప్రపంచం లో ఎక్కడా కూడా వర్కౌట్ కాదు. ఒక కన్న తండ్రి తన కొడుకు లావుగా ఉన్నాడు అని తిట్టాడు. ఎవరైనా తమ కొడుకు ఎంత బాగా లేకపోయినా హక్కున చేర్చుకుంటారు. ఇది మానవ ధర్మం. అని చెప్పాను దానికి రవి బాబు మీరు చాలా 'ఓల్డ్ ఫ్రెండ్' ఇప్పుడు ఇలాంటి కథలే  ట్రెండ్ సెట్ చేస్తాయి. మీరే చూస్తారు కదా  ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో..! అని చెప్పాడు దానితో సరే అన్నాను. ఆ తర్వాత సినిమాను ఎనిమిది కోట్ల లో పూర్తి చేస్తాను అని చెప్పాడు. కానీ సుడిగాడు సినిమా ఏడు కోట్ల కదా మరి ఇంత  ఖర్చు పెడితే వర్కౌట్ అవుతుందా అని అడిగాను. 


ఈ సినిమాను ఆ సినిమాతో పోల్చకండి ఇదొక డిఫరెంట్ సినిమా అని చెప్పాడు. తీరా సినిమా  పూర్తయ్యే వరకూ చూస్తే 11 కోట్ల బడ్జెట్ అయ్యింది. సినిమాను ఎవరు కూడా కొనడానికి ముందుకు రాలేదు. ఆఖరిగా సాటిలైట్ రైట్స్ మూడు కోట్లు వచ్చాయి. లడ్డు బాబు సినిమా ద్వారా మొత్తంగా నేను ఎనిమిది కోట్లు నష్టపోయాను. అల్లరి నరేష్సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అంటూ ఈ ప్రొడ్యూసర్ రవి బాబు మీద ఈ వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: