హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ , జి నాగ కోటేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'నిర్మల కాన్వెంట్' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఈ యువ హీరో కొంతకాలం గ్యాప్ తీసుకొని కె . రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వంలో రూపొందుతున్న 'పెళ్లి సందడి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది ఇదివరకే కె . రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ నటించిన 'పెళ్లి సందడి'  ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే .


ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాకు కూడా ఆ పేరు పెట్టినట్లు విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం రోషన్ హీరోగా నటిస్తున్న 'పెళ్లి సందడి' సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్లు , ఫస్ట్ లుక్ లు జనాలను బాగా ఆకట్టుకున్నాయి . మరీ ముఖ్యంగా 'ప్రేమంటే ఏంటి' అనే పాట మిలియన్ల కొద్దీ వ్యస్ నీ సాధిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా గురించి గౌరీ రోణంకి మాట్లాడుతూ సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది .


 రోషన్ , శ్రీలీలా జంట మీకు బాగా నచ్చుతుంది . ఈ సినిమాలో ఉన్న లవ్ ట్రాక్ , కామెడీ , ఎమోషన్స్ అన్నీ కూడా జనాలను అలరిస్తాయి , కీరవాణి గారి సంగీతం మరొక సారి మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది అని , ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయని నవంబర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఈ దర్శకురాలు తెలిపింది. ఈ సినిమాకు కెమెరా : సునీల్ కుమార్ నామ , సాయిబాబా కోవెలమూడి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

మరింత సమాచారం తెలుసుకోండి: