సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో మంచి నటనతో, కామెడీ టైమింగ్ తో, తమ అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న నటులలో సురేఖవాణి కూడా ఒకరు. ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూనే, తన కూతురుని కూడా తమ అభిమానులకు పరిచయం చేస్తోంది. ఇక ఈమె కూతురికి  సినీ ఇండస్ట్రీకి రాకముందే ఎక్కువ మంది ఫాలోవర్ లను  ను కలిగి ఉండడం విశేషం.అయితే ఈమె తన కూతురు సినీ ఎంట్రీ పై తన మనసులో మాటను తెలియజేసింది. అదేమిటో చూద్దాం.

సోషల్ నెట్ వర్క్ కు ఎప్పుడు దగ్గరగా ఉంటారు సురేఖవాణి తన కూతురు. సురేఖ వాణి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఇక ఈమె కూతురు సుప్రీత నాయుడు కూడా సినీ ఎంట్రీ ఎప్పుడు వస్తుందనే విషయంపై ఆమె స్పందించగా, ప్రస్తుతం తన కూతురు చదువుమీద మాత్రమే దృష్టి పెడుతోంది, అలాగే తను ఒక డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ లో కూడా  శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

అటు డాన్స్ ను, ఇటు డైలాగులు కూడా స్పష్టంగా పలికే విధంగా తెలుగు మాస్టర్ దగ్గర అ కొన్ని పాఠాలు నేర్చుకుంటోంది. అయితే ఈమె ఎప్పుడు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుందా..? అనే విషయంపై నేను త్వరలోనే మీడియాకు తెలియజేస్తాను  అంటూ చెప్పుకొచ్చింది. అయితే సురేఖ వాణి కూతురు త్వరలోనే ఎంట్రీ ఉండనున్నట్లు మనకు తెలుస్తోంది. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే,  సినీ ఇండస్ట్రీలోకి ఎక్కువగా హీరో హీరోయిన్లు కూతుర్లు, కొడుకులు ఎంట్రీ ఇవ్వడం చూసాము.

అయితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి తన కూతురిని కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తాననడం తో సినీ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే సుప్రీత నాయుడిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసినా, ఆమె హీరోయిన్ గా  ఎదుగుతుందా, లేదా తన తల్లి మాదిరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో సరిపెట్టుకుంటుందా అనే విషయంపై వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: