తెలుగులో మొదటి నుండి హిట్లు కొడుతూ స్టార్ హీరోగా ఎదిగిన వారు ఉన్నారు . మరియు కెరియర్ ప్రారంభం నుండి ఫ్లాపులను  ఎదుర్కొంటూ  కనుమరుగైపోయిన  హీరోలు కూడా  ఉన్నారు . వీరితో పాటు కెరీర్ ప్రారంభంలో మంచి విజయాలు అందుకుంటూ ఈ హీరోలు ఖచ్చితంగా స్టార్స్ అవుతారు అని అనుకునే సందర్భంలోనే వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయిన వారు కూడా ఉన్నారు . అందులో మనం మొదటి గా మాట్లాడు కొవాల్సింది ఉదయ్ కిరణ్ , తరుణ్ కెరియర్ ప్రారంభంలో వరుస విజయాలు సాధిస్తూ , తర్వాత వరుస అపజయాలను ఎదుర్కొని డీలా పడిపోయారు .


ఈ ఇద్దరు హీరోలు. తాజాగా వరుణ్ సందేశ్  తన పుట్టిన రోజు సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా కొన్ని విషయాల గురించి తెలిపాడు . యాంకర్ మీరు కూడా కెరీర్ ప్రారంభంలో హ్యాపీ డేస్ , కొత్త బంగారు లోకం లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్  లను అందుకున్నారు . ఆ తర్వాత వరుస అపజయాలతో వెనుకబడి పోయారు. మీరు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ , తరుణ్ లా మారి పోయారా అని అడగగా..! వరుణ్ సందేశ్ అవును . ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది . కాకపోతే ఒకరి జీవితాలతో మరొక జీవితాలకు పోల్చవద్దు .


నేను నా చివరి ప్రయత్నం వరకు సినిమాలు చేస్తాను .  ప్రస్తుతం కూడా సినిమాల్లో నటిస్తున్నాను. ఆ సినిమాల ద్వారా నేను కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాను అని ఈ హీరో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ 'ఇందువదన' అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ , కొన్ని పాటలను ఇప్పటికే విడుదల చేశారు వీటికి మంచి ప్రజాదరణ దక్కింది. మరి ఈ సినిమాతో వరుణ్ సందేశ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: