యుగాలు గడిచినా కుల పిచ్చి మాత్రం పోవడం లేదు. చదువు టెక్నాలజీ పెరిగితే కులం పునాదులు పెకులించుకుపోతాయని అప్పట్లో భావించేవారు. కానీ రాను రాను కుల పిచ్చి పెరుగుతుందే తప్ప త‌గ్గ‌టం లేదు. దానికి ప్రస్తుతం చూస్తున్న సంఘటనలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కుల హత్యలు.. కుల దూషణలు కుల రాజకీయాలు ఇలా ఎన్నో సంఘటనలు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. పెద్దవాళ్లు, ముసలి వాళ్ళ కంటే యువతలోనే ప్రస్తుతం కుల ప్ర‌స్థావ‌న ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్రతి ఒక్కరూ మేము ఫలానా అని చెప్పుకుంటూ గొప్ప‌గా ఫీల్ అవుతున్నారు. దానికి టిక్ టాక్ లో కులం పేరుతో వచ్చిన ఎన్నో పాట‌లు వీడియోలే నిద‌ర్శ‌నం. టిక్ టాక్ లో దాదాపు అన్ని కులాల వారు త‌న కులాలను పొగుడుకుంటూ ఇత‌ర కులాల‌ను దూషిస్తూ వీడియోలు చేయ‌డం క‌నిపించింది. 

అంటే తమ మెదళ్ళలో కులం పై అభిమానం ప్రేమ ఎంతో ఉంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇక కులం ప్ర‌స్థావ‌న ఇంత‌లా పెర‌గ‌టానికి మన కుల రాజకీయాయ నాయకుల ప్ర‌సంగాలు కూగా ఒక కార‌ణం అనే చెప్పాలి. ఎన్నిక‌లు వ‌చ్చిందంటే చాలు త‌మ ఓట్ల కోసం కులాన్ని వాడు కుంటూ ఉంటారు. అయితే ఈ కులాల ప్రభావం అనేది కేవలం రాజకీయాల్లోనే కాదు సినిమాల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. కొంత మంది కి కులం పైన అభిమానంతో తమ వాళ్లని సినిమాల్లోకి తీసుకుంటారు. అయితే న‌టుడు బ్రహ్మాజీ ని కూడా ఓ అభిమాని అలాగే సినిమాల్లోకి తీసుకోవాలంటూ కోరాడు. బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ కు స్పందించాడు.

అన్నా నేను నేను మన‌ కమ్యూనిటీకి చెందిన వాడిని నాకు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం...  మీ తరఫున ఏ చిన్న అవకాశం ఉన్నా నాకు ఏదో ఒక పాత్రలో నటించే అవకాశాన్ని ఇవ్వండి. అంటూ కామెంట్ చేశాడు. ఇక ఆ కామెంట్ కు బ్రహ్మాజీ మాత్రం దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. బ్రహ్మాజీ తాను తెలుగోడిని.. భారతీయుడిని అని అదే తన కమ్యునిటీ అని రిప్లై ఇచ్చాడు. ఇక బ్రహ్మాజీ కామెంట్ కు నెటిజ‌న్ లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా బ్రహ్మాజీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా సినిమాల్లో కామెడీ విలన్ పాత్రలు చేయడంలో బ్రహ్మాజీ ప్రతి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: