తాతకు తగ్గ మనవడిగా, తాత పోలికలను పునికి పుచ్చుకుని , సినీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఈయన గురించి ఏ చిన్న పిల్లవాడిని అడిగినా సరే ఇట్టే చెప్పేస్తారు. అంతలా అందర్నీ తన నటనతో , డాన్స్ లతో ఆకట్టుకుంటూ ఉంటాడు మన యంగ్ టైగర్. ఇకపోతే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అది ఆహారం అయినా కావచ్చు లేదా ఫ్యాషన్, టెక్నాలజీ ఇలా రకరకాల రంగాలలో ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. ఇకపోతే ఫుడ్ విషయం వస్తే , మన యంగ్ టైగర్ కి ఆహారం అంటే చాలా ఇష్టమట. అందులో మరీ ప్రత్యేకించి ఒక స్పెషల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్టీఆర్ 1983 వ సంవత్సరం మే 20వ తేదీన నందమూరి హరికృష్ణ , షామిలి దంపతులకు జన్మించారు. ఎన్టీఆర్ కు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం.ఆ ఇష్టం తోనే ఆయన కూచిపూడి డాన్స్ కూడా నేర్చుకొని ,cపలు ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక తన విద్యాభ్యాసం విషయానికి వస్తే హైదరాబాద్ సచివాలయం దగ్గర్లో ఉన్న విద్యారణ్య అనే ఉన్నత పాఠశాలలో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.మనవడి లో ఉన్న కళాభిమానానికి మంత్ర ముగ్ధులై, నందమూరి తారక రామారావు బ్రహ్మర్షి విశ్వామిత్ర అని సినిమాలో బాలనటుడిగా బాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇక అంతే కాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో బాల రామాయణం అనే సినిమాలో రాముడిగా నటించడం జరిగింది. ఇక హీరోగా నిన్ను చూడాలని సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఆయనకు ఇష్టమైన ఆహారం విషయానికి వస్తే , వాళ్ళ అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టమట. ఇక ముఖ్యంగా నాటుకోడి కూర , రొయ్యల బిర్యానీ తో పాటు కోడి కూర వేపుడు అంటే చాలా ఇష్టం గా తింటూ ఉంటారు ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: