రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రెండో సినిమా రాఘవేంద్ర. ఈశ్వర్ సినిమాతో రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించిన ప్రభాస్ తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుని రెండో సినిమాగా సురేష్కృష్ణ దర్శకత్వంలో రాఘవేంద్ర అనే సినిమా చేశాడు.  ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ సినిమా ప్రభాస్ ను హీరోగా నిలబెట్టడానికి ఎంతగానో సహాయపడింది. కెరీర్ తొలినాళ్లలో ప్రభాస్ మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ఆయన నటించిన బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారి వరుస భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.

రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్వేత అగర్వాల్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. అల్లరి నరేష్ హీరోగా నటించిన అల్లరి సినిమా తో ఈమె హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత కన్నడలో సుదీప్ తో ఓ సినిమా చేసినా ఆమెకు గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ తెలుగులో ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమా లో నటించింది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగా ఆ తర్వాత మరిన్ని అవకాశాలు సంపాదించుకోవడంలో ఈమె విఫలమయింది.

ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఐదు సంవత్సరాల అనంతరం తందూరి లవ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాంతో చివరిగా ఆమె ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించిన శాపిత్ చిత్రంలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఆమె మళ్లీ కం బ్యాక్ చేస్తుంది అనుకున్నారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఇండస్ట్రీని వదిలి పోయింది అని మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం ఈమె ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అనే విషయం ఎవరికీ తెలియదు. హీరోయిన్లు వరుస సినిమాలు చేస్తూ ఉంటేనే వారికి దక్కుతుంది గుర్తింపు తగ్గుతుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే మరో సినిమా ఛాన్స్ వచ్చే అవకాశం ఉండేది మరి ఈ నేపథ్యంలో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందా అనేది చూడాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: