ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచేసాడు రాజమౌళి.ఇప్పటికే ఈ పాన్ ఇండియా మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.ఇక ఇటీవల విడుదలైన రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో అయితే సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ ని రాబట్టి దుమ్ము రేపింది.ఇక ఈ సినిమాను అనుకున్నట్లుగానే అక్టోబర్ 13 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పలు మార్లు కన్ఫర్మ్ చేశారు.ఈ లోగా సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు మూవీ టీమ్.ఇక ఇప్పటికే వాటికి సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ బుల్లితెరపై హోస్ట్ చేయబోయే ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో కి మొదటి గెస్ట్ గా రామ్ చరణ్ రాబోతున్నాడు.

ఇది కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే చేయబోతున్నట్లు సమాచారం.ఇక మరోవైపు ఆ లోపు మిగతా నటీ నటులతో పలు ఇంటర్వ్యూలు, టీవీ షో లతో తన సినిమాను ఫుల్ గా ప్రమోషన్స్ చేసుకోవాలని భావిస్తున్నారు రాజమౌళి.ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.ఇదిలా ఉంటె ఈ సినిమా నుండి అతి త్వరలోనే మరో సర్ప్రైజ్ ని ప్రేక్షకులకు అందించేందుకు జక్కన్న సిద్ధం అయినట్లు తెలుస్తోంది.ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి 'బి హైండ్ ద సీన్స్' అనే పేరుతో త్వరలోనే ఓ డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారట.

అంతేకాదు దీన్ని ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయట.ఇక ఆర్ ఆర్ ఆర్ కనుక విడుదలైతే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.అందుకు ఈ సినిమా కోసం వాళ్ళు పడిన కష్టమే దానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇక సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుండే ప్రమోషన్ వీడియోలు,యూట్యూబ్ ఇంటర్వ్యూలు, టీవీ షో లతో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేసాడు రాజమౌళి.ఇందుకోసం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR