విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం కుదరక డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేశారు. అమేజాన్ ప్రైం లో నారప్ప రిలీజైంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి 40 కోట్ల దాకా వచ్చాయని అంటున్నారు. సినిమా బడ్జెట్ వగైరా లెక్కలు చూసుకుంటే నారప్ప సినిమా నిర్మాత సురేష్ బాబుకి 17 కోట్ల దాకా లాభం తెచ్చి పెట్టిందని టాక్. తమిళ సూపర్ హిట్ సినిమా అసురన్ కు రీమేక్ గా వచ్చిన నారప్ప తెలుగు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.

థియేట్రికల్ రిలీజ్ లాగా కలక్షన్స్ లెక్కలు ఏమి ఉండవు కాబట్టి సినిమా హిట్టా ఫట్టా అని చెప్పడం కష్టం. అమేజాన్ ప్రైం లో రిలీజైన నారప్ప ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో సినిమా ఓటీటీ రిలీజ్ మంచి నిర్ణయమే అని అనుకుంటున్నారు చిత్రయూనిట్. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వచ్చిన నారప్ప సినిమాలో విక్టరీ వెంకటేష్ తన నట విశ్వరూపం చూపించారు. సినిమాలో రెండు వేరియేషన్స్ లో వెంకీ తన అనుభవాన్ని జోడించి మరి నటించారు.

ముందు ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ అనుకున్నా ప్రస్తుతం థియేటర్లు తెరచుకునే అవకాశం లేదనే ఉద్దేశంతో డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేశారు. అమేజాన్ ప్రైం లో రిలీజైన తెలుగు సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. అయితే నారప్ప ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిందని చెప్పాలి. అసురన్ చూసిన వారు జిరాక్స్ కాపీ అంటున్నా నారప్ప మాత్రమే చూసిన తెలుగు ఆడియెన్స్ మాత్రం ఇంప్రెస్ అవుతున్నారు. మొత్తానికి నారప్ప సినిమాతో వెంకటేష్ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమాకు రెమ్యునరేషన్ గా కూడా భారీగానే తీసుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు దృశ్యం 2 కూడా రీమేక్ చేస్తున్నారు వెంకీ మామ ఆ సినిమాను కూడా దాదాపు ఓటీటీ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: