శోభన్ బాబు టాలీవుడ్ లో అలనాటి నటులలో మేటి. మహిళా అభిమానులు విశేషంగా ఉన్న శోభన్ బాబు కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఏలారు. ఆయన ఖాతాలో ఎక్కువగా సక్సెస్ ఫుల్ మూవీస్ ఉన్నాయి.

ఇదిలా ఉండగా శోభన్ బాబు విషయంలో కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఎటువంటి సినిమాకు అయినా కచ్చితంగా తన పారితోషికం తీసుకుంటారు అని. అయితే శోభన్ బాబు గురించి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఆయన ఎన్నో గుప్త దానాలు చేసేవారు. ఎందరినో ఆదుకున్నారు. ఆయన సినిమా వారికి మంచి చెబుతూ ఎలా ఉంటే అభివృద్ధి చెందుతామని కూడా సలహాలు ఇస్తూ ఉండేవారు అంటారు. ఇక శోభన్ బాబు చాలా క్రమ శిక్షణతో ఉంటారు అని కూడా చెబుతారు.

ఇవన్నీ పక్కన పెడితే 1990 దశకంలో మాతృదేవోభవ అన్న మూవీని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు నిర్మించారు. ఈ సినిమాలో మాధవి, నాజర్ నటించారు.  మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన వంద రోజుల ఫంక్షన్ కి శోభన్ బాబు ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి చిత్రాలు నిర్మించి హిట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు అని నిర్మాతను బాగా పొగిడేశారు.

అంతే కాదు పితృదేవోభవ అన్న సినిమా కనుక అదే బ్యానర్ లో నిర్మిస్తే తాను ఫ్రీగా యాక్ట్ చేస్తానని సభాముఖంగానే ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చేశారు. శోభన్ బాబు ఎలాంటి అభిరుచి కలిగిన వారో, ఆయన విలువలు ఏంటి అన్నది ఈ స్టేట్మెంట్ చాటి చెబుతుంది. మంచి సినిమాలకు, నిర్మాతలకు శోభన్ బాబు ఎపుడూ అండగా ఉండేవారు. ఆయన కొత్త వారినీ, న్యూ టాలెంట్ ని కూడా ప్రోత్సహించేవారు. మొత్తానికి శోభన్ బాబు గురించి తెలియని వారికి ఆయన గురించిన ప్రతీ వార్తా ఒక ఆసక్తిని కలిగించేదే అని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: