ఇక కరోనా లాక్ డౌన్ తో భారీగా నష్టపోయిన పరిశ్రమల్లో సినిమా పరిశ్రమ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పాలి.ఇక సినిమా థియేటర్లలో సినిమాలకు బదులుగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలోనే సినిమాలు విడుదల కావటం అనేది ఇక అనేక సినిమాలకు సరికొత్త ప్లాట్ ఫాం దొరికినట్లైంది. దీంతో  పెద్ద హీరోల సినిమాలు ఈ వేదిక మీద విడుదలయ్యాయి. అయితే తెలుగులో మాత్రం తొలిసారి ఒక స్టార్ హీరో సినిమా ఓటీటీలో విడుదలై చరిత్ర సృష్టిస్తుంది.వెంకటేశ్ నటించిన రీమేక్ మూవీ 'నారప్ప' ఇటీవల ఓటీటిలో రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించిన వెంటనే..సినిమా పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక టాలీవుడ్ ఆగ్ర నిర్మాతైన సురేశ్ బాబు తమ సినిమాని ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదల చేయటాన్ని నిర్మాతలు ఇంకా ఎగ్జిబిటర్లు వ్యతిరేకించడం జరిగింది. ఇక అయినా కాని నిర్మాతలు నారప్ప సినిమాని అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఇక పెద్ద ఎత్తున వీక్షకులు ఈ చిత్రాన్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాను అమెజాన్ ఎంత డబ్బు పెట్టి కొనుగోలు చేసింది? ఈ సినిమాతో నిర్మాతలకు ఎంత ఆదాయం వచ్చింది? లాంటి వివరాలు అనేవి ఇప్పుడు పెద్దగా బయటకు రాలేదు.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే ఈ సినిమా ఓటీటీతో పాటు ఇంకా శాటిలైట్ రైట్స్ తో పాటు అలాగే ఇతర స్ట్రీమ్ ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని పక్కన పెడితే అమెజాన్ సంస్థ ఒక్కటే నిర్మాతలకు రూ.40 కోట్ల ఫ్యాన్సీ ధరకు సినిమాను సొంతం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ఈ ఫ్యాన్సీ డీల్ తో నిర్మాతలకు రూ.17 కోట్ల లాభం వచ్చిందని నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఈ సినిమాతో ఫైనల్ గా నిర్మాతలు బాగానే లాభ పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: