కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా సినిమా పరిశ్రమ కష్టాల్లో పడింది. వేలమంది  సినిమా కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. షూటింగ్ లు వాయిదా పడటంతో చేయడానికి  పని లేక సినిమా కార్మికులు చాలా కష్టపడ్డారు. సినిమా పరిశ్రమ ద్వారా కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. కరోనా కారణంగా సుమారు 6 నెలలుగా ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు.దేశంలో ఉన్న సినిమా పరిశ్రమలో తెలుగు సినిమా పరిశ్రమ చాలా పెద్దది. మద్రాస్ నుండి విడిపోయాక హైదరాబాద్ కేంద్రంగా సినిమా పరిశ్రమ కొనసాగింది.తెలుగు సినిమా పరిశ్రమలో సినిమా కార్మికుల కష్టాలు తీర్చేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(maa )ను కొంతమంది తెలుగు సినిమా పెద్దలు దీనిని స్థాపించారు. ఈ మా ద్వారా సినిమా కార్మికుల కష్టాలు తీర్చేవారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సహాయం అందజేసారు.తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద సినిమా షూటింగ్ లు జరిగితేనే చాలా మందికి ఉపాధి కలుగుతుంది. కరోనా కారణంగా అన్ని షూటింగ్ లు వాయిదాపడ్డాయి.ఈ సమయంలో సినిమా పెద్దలు చేయి చేయి కలిపి సినిమా కార్మికులకు మేము వున్నాము అని భరోసా ఇచ్చారు. చాలా మంది సినిమా హీరోలు, హీరోయిన్ లు వారికీ తోచినంత మొత్తాన్ని సినిమా పరిశ్రమకు విరాళాలు అందించారు. ఇదిలా ఉండగా కరోనా కారణంగా కొంతమంది స్టార్ హీరోల చిత్రాలు వాయిదా పడ్డాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల్లుఅర్జున్ పుష్ప  సినిమా, ప్రభాస్ రాధే శ్యాం సినిమా. ఈ రెండు చిత్రాలు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. కరోనా లేకపోయి ఉంటే ఈ చిత్రాలు ఇప్పటికే విడుదల అయ్యి సందడి చేస్తూ ఉండేవి. ప్రభాస్ రాధే శ్యాం చిత్రం చాలా భాగం విదేశాలలో చిత్రికరించడం జరిగింది. కరోనా కారణంగా ఇతర దేశాలలో షూటింగ్ కు అనుమతి లభించలేదు. అందుకే షూటింగ్ చాలా కాలం వాయిదాపడింది. షూటింగ్ కు బ్రేక్ పడటంతో ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజాగా రాధే శ్యాం షూటింగ్ కు అనుమతి లభించడంతో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని చిత్ర షూటింగ్ కంప్లీట్ చేయాలనీ ప్రభాస్ చూస్తున్నట్లు సమాచారం.

 ఇదిలా ఉండగా సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ పుష్ప మూవీ చేస్తున్న విషయం  తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదాపడింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ  సినిమాకు అనుమతి లభించకపోవడంతో వాయిదాపడింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కు అనుమతి రావడంతో బన్నీ పుష్ప షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: