టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నా సరే కేవలం ఒక మోస్తారు హీరోయిన్ గా మాత్రమే మిగిలిపోయింది రెజినా కసాండ్ర. రావడానికి మంచి మంచి ఛాన్సులు వచ్చినా సరే అమ్మడు ఎందుకో కెరియర్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో వెనకపడ్డది. ఈ క్రమంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వాడుకుంటూ వస్తుంది. ఆమధ్య నెగటివ్ టచ్ ఉన్న సినిమాల్లో కూడా చేస్తూ వచ్చిన రెజినా లేటెస్ట్ గా వెబ్ సీరీస్ లకు ఓకే చెప్పింది.

ఈమధ్య స్టార్ హీరోయిన్స్ గా కూడా వెబ్ సీరీస్ ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రెజినా కూడా అందుకు సరే అనేసింది. ఆహాలో అన్యా ట్యుటోరియల్ సినిమా చేస్తుంది రెజినా. ఆమె చేస్తున్న ఈ వెబ్ సీరీస్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. వెండితెర మీద దాదాపు ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తున్న రెజినా డిజిటల్ స్క్రీన్ మీద రచ్చ చేయాలని చూస్తుంది. కెరియర్ మొదట్లో గ్లామర్ షో విషయంలో మొహమాట పడిన అమ్మడు ఇప్పుడు ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు సై అంటుంది.

రెజినా చేస్తున్న అన్యాస్ ట్యుటోరియల్ వెబ్ సీరీస్ వెరైటీ కాన్సెప్ట్ తో వస్తుందని తెలుస్తుంది. ఇది కాకుండా రెజినా షాకిని ఢాకిని అనే సినిమాలో కూడా నటిస్తుంది. రెజినాతో పాటుగా నివేదా థామస్ ఆ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటుందని తెలుస్తుంది. ఓ పక్క వెబ్ సీరీస్ మరో పక్క ప్రయోగాత్మక సినిమా ఈ రెండిటితో తెలుగులో రెజినా మళ్లీ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. మరి అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా వచ్చిన అడపాదడపా అవకాశాలను కాదనకుండా చేస్తుంది రెజినా. అయితే అక్కడ ఇక్కడ తన ఫ్యాన్స్ ను మళ్లీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న రెజినా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: