ఈటీవీ లో ప్రసారమయ్యే అటువంటి జబర్దస్త్ ప్రోగ్రాం లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు . ఒకప్పుడు వేణు వండర్స్ అనే టీమ్ కూడా వుండేది. ఇక ఈయన జబర్దస్త్ లో ఎన్నో షోల తో ప్రేక్షకులను అలరించి, మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అంతగా ప్రేక్షకులను నవ్వించినా తన మనసులో ఎంతో బాధను పెట్టుకున్నాడు, ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.


వేణు వండర్స్ 2004లో డైరెక్టర్ తేజ తో "జై"  సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక తర్వాత గోపీచంద్ తో రణం, అల్లరి నరేష్ తో దొంగల బండి వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన కూడా ఇప్పుడు సోషల్ మీడియా కి దగ్గర లోనే ఉంటాడు. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో తన జబర్దస్త్ లైఫ్ గురించి  కొన్ని విషయాలను పంచుకున్నాడు.

వేణు  కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. ఈయనకి మొత్తం 5 మంది సిస్టర్స్,4 బ్రదర్స్ ఉన్నారు. వీరి అమ్మానాన్న కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవారు. వారి కష్టాన్ని చూసి చలించిపోయి వేణు చదువు మానేసి  తను కూడా రూ.50,000 జీతంతో తన జీవితాన్ని మొదలు పెట్టాడు. ఇదిలా ఉంటే లవ్ స్టోరీని ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపాడు వేణు. "చదువుకునే సమయంలో.. పుట్టేది లవ్ కాదని ,అట్రాక్షన్ అని ఆ తర్వాత తెలుసుకున్నాడట. ఇందుకు కారణం జబర్దస్త్ టీంలో పని చేస్తున్నప్పుడు.. ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడి , అది ప్రేమగా మారింది. అయితే ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉండడంతో పాటు తన డైలాగులకు మురిసిపోతూ ఉండేదట.. అయితే అవన్నీ అప్పటి వరకే అని,  లవ్వంటే మనసుతోనే ప్రేమించాలని , అప్పుడే అది స్వచ్ఛమైన ప్రేమ అవుతుందని" అంటున్నాడు వేణు.


ఒక అమ్మాయి కోసం ఫేక్ బర్తడే లను సృష్టించుకొని, తన ఫ్రెండ్స్ తో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళేవాడట. ఒక రోజు ఆ అమ్మాయి కోసం ఏకంగా 25 వేల రూపాయలు ఖర్చు చేశాడట వేణు. అయితే ఒకసారి ఆలోచించి, తన తల్లిదండ్రుల కంటే తన అక్క వాళ్ళు వేణుని చాలా బాగా చూసుకుటారని, అందులో నూ తన చిన్న అక్క అంటే తనకు చాలా ఇష్టం అని, ఎవరో ఒక అమ్మాయి కోసం 25,000 రూపాయలు ఖర్చు చేశాను..అని ఆలోచించి , ఆ అమ్మాయిని కూడా దూరం పెట్టి, వేణు వాళ్ళ అక్క వాళ్ళు చూసిన సంబంధాన్ని ఓకే చేసి , ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: