గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. ఇంటర్నేషనల్ స్టార్ గా ఓ వెలుగు వెలిగి పోతుంది. ప్రియాంక అలా బయటకు వచ్చినా సరే కెమెరాలు క్లిక్ మనాల్సిందే. ఆ రేంజ్ లో ఆమెకు క్రేజ్ ఉంది కాబట్టే ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియాంక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయింది. అయితే బ్యూటీకి, నిక్ జోనస్ కు అసలు ఎలా కుదిరిందా అనే విషయం ఇప్పటికీ చాలామందికి సస్పెన్స్ గానే ఉంది. నిజానికి ప్రియాంక టెలివిజన్ నటుడిని పెళ్లి చేసుకోవాల్సింది అట. కానీ నీ ఆమె అదృష్టం బాగుండడంతో ఇంటర్నేషనల్ స్టార్ దొరికాడు. విషయంలోకి వస్తే రెండు దశాబ్దాలు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన ప్రియాంకకు అమెరికన్ పాప్ సింగర్ నిక్ తో 2016లో సోషల్ మీడియా ద్వారా పరిచయం జరిగిందట. అలా మొదలైన స్నేహం కాస్తా ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునే దాకా వెళ్ళింది. అప్పటి నుంచి ఫోన్ లో లో చాటింగ్ లో మీటింగ్ లో స్టార్ట్ అయ్యాయి. 

పరిచయం 2016 లోనే జరిగిన వీళ్లిద్దరు కలుసుకుంది మాత్రం 2017లో జరిగిన ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ లో. ఆ తరువాత వీరు డేటింగ్ చేస్తూ కెమెరా కంటే కూడా చిక్కారు. అదే కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. 2018లో ప్రియాంక, నిక్ పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. కానీ అంతకుముందే ప్రియాంకకు వేరొకరితో పెళ్లి ప్రయత్నం కూడా జరిగిందట. ఆమె బాలీవుడ్లో స్టార్ గా వెలిగి పోతున్న సమయంలో పలువురు హీరోలతో ప్రేమాయణం అంటూ వార్తలు వచ్చాయి. కానీ ప్రియాంక వాటిపై ఎప్పుడూ నోరు విప్పలేదు. ప్రియాంక వాళ్ళ ఆంటీ హిందీ టీవీ నటుడు మోహిత్ రైనాను ప్రియాంక పెళ్లి చేసుకుంటే బాగుంటుందని భావించిందట. అదే విషయం ప్రియాంక తల్లిదండ్రులకు కూడా చెప్పిందట. కానీ  అప్పటికే ప్రియాంక తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఫుల్ జోష్ లో ఉంది. అతనేమో ఇంకా బుల్లితెర నటుడు. అందుకే ఈ పెళ్లికి ప్రియాంక తల్లిదండ్రులు అంగీకరించలేదట. మొత్తానికి నిక్ తో పెళ్లి తరువాత ప్రియాంక కెరీర్ ప్రస్తుతం అద్భుతంగా నడుస్తోంది. ఇటీవలే అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్ ప్రారంభించింది. హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా, యాక్టివిస్ట్ గా, యూనిసెఫ్ ప్రచారకర్తగా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తోంది. అంతేకాదు తన అనుభవాలను వివరిస్తూ "అన్ ఫినిష్డ్" అనే బుక్ రాసి సంచలనం సృష్టించింది. ఇదన్నమాట ప్రియాంక పెళ్లి సంగతి !

మరింత సమాచారం తెలుసుకోండి: