సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఒక్కోసారి ఒక్కో సినిమా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇక సినిమాలైతే మెగాస్టార్ ఫ్లాప్ లో ఉన్నప్పుడు , తనకంటూ స్టార్డం తెచ్చిపెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి సినిమాలలో ఇంద్ర సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాడనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.


పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా మెగాస్టార్ కెరియర్ ని మార్చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఈ రోజు కి విడుదలయ్యి దాదాపు 19 సంవత్సరాలు కావస్తోంది. ఇక ఈ సినిమా విడుదలై ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ సినిమాల కంటే ముందు ఎన్నో సినిమాలతో డిజాస్టర్ లో ఉన్నాడు చిరంజీవి.

ఇక ఇంద్ర సినిమాని బి.గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి కలిసి ఇండస్ట్రీ హిట్ క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమాని సి.అశ్వనీదత్ బ్యానర్ పై నిర్మించిన అతి పెద్ద చిత్రం, ఇక ఈ సినిమాలో ఇంద్ర తనదైన శైలిలో ఫ్యాక్షనిజం చూపించి, ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇక ఇప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే. ఈ సినిమా ఇంకొక ఎత్తు అని చెప్పవచ్చు.


సినిమా ద్వారా నంది అవార్డు అందుకున్నాడు చిరంజీవి. ఇక ఈ సినిమాకి మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఈ చిత్రం అప్పట్లోనే  10 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా.. టోటల్ గా ఈ సినిమా 29 కోట్ల రూపాయలను  సాధించి, ఇండస్ట్రీ హిట్ టాక్ తో నిలిచిపోయింది. ఇక ఈ సినిమాకి చిరంజీవి రెమ్యూనరేషన్ విషయానికొస్తే అప్పట్లోనే 7.5 కోట్ల రూపాయలు తీసుకోవడం గమనార్హం. ఇక మిగిలిన బడ్జెట్ మొత్తం ఇతర ఆర్టిస్టులకు ఇవ్వడం జరిగింది. ఇక అంతే కాకుండా ఇదే సినిమాని హిందీలో కూడ విడుదల చేశారు.

మొత్తానికి ఈ సినిమా చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పింది అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: