నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి, స్టార్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాతకు తగ్గ మనవడిగా , తండ్రికి తగ్గ కొడుకు నిలబడ్డది ఇద్దరే ఇద్దరు . అందులో ఒకరు జూనియర్ ఎన్టీఆర్,మరొకరు నందమూరి బాలకృష్ణ అని చెప్పవచ్చు. వీరిద్దరు నాటి నుంచి నేటి వరకు స్టార్ హీరోలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న విషయం తెలిసిందే. ఇక కళ్యాణ్ రామ్ కూడా హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, నిర్మాతగా తనలో ఉన్న ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ వాళ్ల పెద్దన్నయ్య జానకిరామ్ కూడా సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా చేసి, ఆయన స్వర్గస్తులైన విషయం తెలిసిందే.


అయితే ఈ కుటుంబం నుంచి మరో హీరో కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కాకపోతే ఎవరు పెద్దగా ఆయనని ఆదరించ లేకపోయారు. అతనెవరో కాదు నందమూరి మోహనకృష్ణ తనయుడు నందమూరి తారక రత్న. ఇక ఈయన నటించిన సినిమాలు ఒక్కటి కూడా విజయాన్ని సాధించలేదు. ఇక దర్శక నిర్మాతలు కూడా తారకరత్న వైపు చూడడమే మానేశారు. ఇక అసలు ఈ హీరో కూడా ఉన్నాడని చాలామందికి బహుశా తెలియకపోవచ్చు. అటు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు లేని వ్యక్తిగా మిగిలిపోయాడు తారకరత్న. అయితే ఈయన వరల్డ్ రికార్డును సృష్టించాడు.


అదేమిటంటే, సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి ఒక హీరో ఒకటి లేదా రెండు లేదా మూడు సినిమాలతో అడుగుపెడతాడు. కానీ ఈయన మాత్రం ఒకేసారి ఏకంగా తొమ్మిది సినిమాలతో హీరోగా ,సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక రికార్డు సృష్టించాడు. అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ తొమ్మిది సినిమాల షూటింగులు కూడా ఒకే రోజు మొదలయ్యాయి. కేవలం 20 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఒకేసారి ఏకంగా తొమ్మిది సినిమాలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అంటే అది అతిశయోక్తి కాదు.

ఇక ఇప్పటికే ఆ రికార్డును ఏ హీరో కూడా బ్రేక్ చేయలేదని చెప్పవచ్చు. ఇక అలా 2002లో వచ్చిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తో పాటు మరో ఎనిమిది సినిమాలను ఒకే రోజు మొదలు పెట్టడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: