త్రిష ప్రేమ వ్యవహారం ఎప్పటికప్పుడు దుమారం లేపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె వయస్సు 40 సంవత్సరాలకు దగ్గర్లో ఉన్నప్పటికీ , ఎప్పటికప్పుడు ఈమె ప్రేమ వ్యవహారం మాత్రం అందరిలో చర్చనీయాంశంగా మారింది. గత నాలుగైదు సంవత్సరాల నుండి త్రిష ప్రేమలో పడిందని ,త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అని అనే వార్తలు వింటూనే ఉన్నాము. ఇకపోతే ఆమెకి ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.
ఇక పోతే మన తెలుగు యంగ్ హీరోతో కూడా ఈమె ప్రేమలో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. తర్వాత తమిళ వ్యాపారవేత్త అయిన వరుణ్ మనియన్ అనే వ్యక్తి తో ప్రేమలో పడి, ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కాకపోతే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో పెళ్లి రద్దు అయ్యింది. ఇప్పుడు మరొకసారి ఒక తమిళ టాప్ డైరెక్టర్ తో త్రిష ప్రేమలో పడిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త తమిళ సినీ ఇండస్ట్రీలో బాగా చక్కర్లు కొడుతోంది. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరు ఈమె ప్రేమ ఇప్పటికైనా ఫలిస్తుందా..?  ఇకనైనా పెళ్లి చేసుకుంటుందా..?అని ప్రశ్నించడం మొదలు పెట్టారు.
ఇకపోతే త్రిష "నీ మనసు నాకు తెలుసు" అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక తర్వాత మన రెబల్ స్టార్ ప్రభాస్ సరసన వర్షం సినిమాలో కూడా నటించి , ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత సిద్ధార్థ తో కలిసి నువ్వొస్తానంటే నేనొద్దంటానా ,మహేష్ బాబు తో కలిసి అతడు , వెంకటేష్ తో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి చిత్రాలు తీసి, మంచి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించి , తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది త్రిష.

సినీ జీవితంలో  సక్సెస్ ఫుల్ అయిన త్రిష , ఇక తన వైవాహిక జీవితంలో సక్సెస్ అవుతుందో ..?లేదో..? చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: