తెలంగాణ రాజకీయాల లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న పొలిటికల్ లీడర్ లలో కేటీఆర్ కూడా ఒకరు . తండ్రి సహాయ సహకారాలతో రాజకీయాల్లో అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ లీడర్ ఎక్కడ ఏ సమస్య జరిగినా ఈయన దృష్టికి వెళ్తే స్పందిస్తూ ఉంటారు . ప్రస్తుతం తెలంగాణ పురపాలక సంఘం మంత్రిగా కొనసాగుతున్న ఈయన సినిమాలు కూడా కాస్త ఎక్కువగానే చూస్తాడు అని చెప్పవచ్చు .


 అప్పట్లో 'లాక్ డౌన్' సమయం లో మీరు ఏం చేశారు అని యాంకర్ కేటీఆర్ ని అడగగా నేను ఈ లాక్ డౌన్ సమయం లో చాలా మలయాళ సినిమాలు చూశాను . అంటూ  తన సినిమాలను నాలెడ్జ్ ను యాంకర్ తో పంచుకున్నాడు . అంతేకాకుండా తెలుగులోనూ ఎన్నో సినిమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్న సందర్భాలున్నాయి . ఏదైనా మంచి సినిమా విడుదలైతే దానిని వీక్షించి ఎలాంటి పక్షపాతం లేకుండా రివ్యూలు కూడా ఇస్తూ ఉంటారు . అయితే శనివారం కేటీఆర్ 44వ పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు మరియు అభిమానులు ఏదైనా ఒక సర్ ప్రైజ్ ని లీడర్ కు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాలు చేపట్టారు .


అందులో భాగంగా గంటలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటాలి అనే ఉద్దేశంతో ముక్కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టారు . అయితే ఈ కార్యక్రమానికి సంతోష్ కుమార్ పలువురు సెలబ్రిటీల మద్దతు కోరారు . దీనిలో భాగంగా ఈ మహత్తర కార్యక్రమానికి నటి రమ్యకృష్ణ మద్దతు తెలిపారు . మొదట కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ . ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ను హరిత తెలంగాణ గా మార్చేందుకు మనం చేతులు కలపాలని ఈ కార్యక్రమంలో అందరూ మొక్కలు నాటి కాలుష్యం లేని తెలంగాణను ఏర్పాటు చేయాలని రమ్యకృష్ణ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: