లక్ష్మీరాయ్ అన్నంత పనీ చేస్తోంది. తాను ఎన్నో అనుకుంది. ఏవోవో కలలు కనింది. కానీ ఒక్కటీ జరుగలేదు. బాగా లావయిపోయన ఈ అమ్మడికి అవకాశాలు ముఖం చాటేశాయి. బాగా ఆలోచిస్తే.. లావే తనకు శాపంగా మారింది అనుకుంది.
సన్నబడితే దశ మారిపోతుందని భావించింది. పెద్దపెద్ద అవకాశాలు వస్తాయని ఆశపడింది. అనుకున్నట్టుగా బరువు అయితే తగ్గింది కానీ.. ఆశలు ఆవిరయ్యాయి. మెరుపుతీగలా మారిన తర్వాత ఈమె కెరీర్ మరీ స్లో అయిపోయింది.  

లక్ష్మీరాయ్‌ ఏమని సన్నబడిందో గానీ.. అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. స్విమ్మింగ్ పూల్ సరదాలు, బికినీ ఫోటోలు అప్‌లోడ్‌ చేస్తూ కుర్రకారులో సెగలు రేపుతోంది. కానీ అవకాశాలు మాత్రం పెరగడం లేదు. అసలు పెరగడం సంగతి పక్కనపెడితే, వచ్చే అవకాశాలు కూడా రాకుండా పోయాయి.  

లక్ష్మీరాయ్‌ బొద్దుగా ఉన్నప్పుడు తమిళనాడు నుంచి బోల్డన్ని ఆఫర్లు వచ్చేవి. సాలిడ్‌ గ్లామర్‌ని ఇష్టపడే తంబీలు లక్ష్మీకి లక్షలు ఇచ్చి మరీ సినిమాల్లోకి తీసుకునేవారు. కానీ సన్నబడిన తర్వాత ఆ కేటగిరీ నుంచే అవకాశాలు అన్నీ తగ్గిపోయాయి. పోనీ కష్టపడి సన్నబడింది కదా అని టాలీవుడ్ అయినా తీసుకుంటుందా అంటే అదీ లేదు.

లక్ష్మీరాయ్‌ బరువుగా ఉన్నప్పుడు తెలుగు దర్శకులు ఐటెమ్‌ సాంగ్స్‌ అయినా ఇచ్చేవాళ్లు. కానీ బరువు తగ్గాక రత్తాలు అసలు వయసు బయటపడింది. ముఖంలో ముప్పై కళలు కనిపిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్‌తో స్పెషల్‌ సాంగ్స్ కూడా రావడం లేదు. దీంతో లక్ష్మీరాయ్ సన్నబడి తప్పుచేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


మొత్తానికి లక్ష్మీరాయ్ ఆఫర్స్ కోసం ఏమైనా చేస్తోంది. చివరకు దాగున్న తన అందాలను ఆరబోసేందుకు కూడా వెనుకాడటం లేదు. బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఒక్కసారిగా మారిపోయి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక హాట్ హాట్ అందాలతో యూత్ గుండెల్లో గుబులు రేపుతుందే గానీ ఏం లాభం..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: