దక్షిణ భారత సినీ చరిత్రలో కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ , లోకనాయకుడు కమల్ హాసన్ , తల అజిత్ టాప్ హీరోలు. ఇక తెలుగులో ఎన్టీఆర్ - ఏఎన్నార్ - చిరంజీవి , కన్నడలో రాజ్ కుమార్ , విష్ణువర్ధన్ స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగారు. శాండల్ వుడ్ లో 1990వ దశకంలో వెండి తెరకు హీరోగా పరిచయం అయిన ఉపేంద్ర ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో వైవిధ్యమైన కథలతో అన్ని భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్ప‌ట్లో ఉపేంద్ర సినిమాలు, ఆయ‌న యాక్ష‌న్ అంటే పిచ్చెక్కిపోయేది. రా - ఏ - ఉపేంద్ర సినిమాలు చూస్తే ఆయన టేస్ట్ ఎంత కొత్తగా ఉంటుందో తెలుస్తుంది. అప్పట్లో ఉపేంద్ర సినిమా వస్తుందంటే కేవలం కన్నడ సినీ అభిమానులే కాకుండా... అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ యూత్ అంతా వెర్రెక్కిపోయి ఉండేది.

ఉపేంద్ర తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకోవ‌డంతో అప్పుడు తెలుగు నిర్మాతలు సైతం ఆయనతో ఇక్కడ సినిమాలు చేశారు. ఒకే మాట - కన్యాదానం లాంటి హిట్ సినిమాల్లో కూడా ఆయన నటించారు. ఆ తర్వాత ఉపేంద్ర కన్నడంలో నటించిన సినిమాలు అన్ని రెగ్యులర్గా తెలుగులో విడుదల అవుతూ వచ్చాయి. చాలా రోజుల త‌ర్వాత తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఉపేంద్ర కెరీర్ ప్రారంభంలో కన్నడం లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ప్రేమ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి.

వారిద్దరు కలిసి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఉపేంద్ర - ప్రేమ జంట అంటే స్పెషల్ ఎట్రాక్షన్. అయితే ఆ తర్వాత ప్రేమ వైఖరి నచ్చక ఉపేంద్ర ఆమెకు దూరమయ్యారని అంటారు. అప్పుడు ఉపేంద్ర తనతో పాటు కొన్ని సినిమాల్లో నటించిన ప్రియాంక ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక తెలుగులో జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన సూరి సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఏదేమైనా అప్పట్లో ఉపేంద్ర - ప్రేమ ప్రేమాయ‌ణం ఒక సంచలనం.

మరింత సమాచారం తెలుసుకోండి: