మ‌ల‌యాలంలో భారీ విజ‌యాన్ని సాధించిన చిత్రం లూసీఫ‌ర్‌. ఇందులో హీరోగా మోహ‌న్‌లాల్ న‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాలోని న‌టించేందుకు న‌టీ న‌టుల‌ను ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర ఒకటి ఉంటుంది. అదే హీరో చెల్లెలి క్యారెక్ట‌ర్.. మ‌ల‌యాలంలో ఆ పాత్రలో ప్రముఖ నటి మంజు వారియర్ న‌టించింది. ముఖ్యమంత్రి కూతురిగా హుందాగా ఉంటూనే ఎన్నో హావ భావాలను అవలీలగా పలికించారు ఆమె. తెలుగులో ఆ పాత్రలో ఎవ‌రు న‌టిస్తార‌నే ఆసక్తి చాలా రోజుల నుంచి నెల‌కొంది.


 అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతిని ఈ పాత్ర కోసం సంప్ర‌దించార‌ట‌ అయితే చిరుకు చెల్లిగా నటించడం ఆమెకు ఇష్టం లేక పోవ‌డంతో న‌టించ‌ను అని చెప్పింది. మరోవైపు నయనతారను సంప్ర‌దించ‌గా ఆమె కూడా నో చెప్పింది. ఇప్పుడే చెల్లి పాత్రలు చేయడానికి తాను  సిద్ధంగా లేన‌ని న‌య‌న్ చెప్పింది. క‌థ న‌చ్చినా ఆ కారణంతోనే నయన్ లూసిఫర్ రీమేక్‌కు నో చెప్పింది.


   ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆచార్య పూర్తైన వెంటనే మరో నాలుగు సినిమాలను ఆయ‌న చేతిలో ఉంచుకున్నారు. ఈ క్రమంలోనే ఒప్పుకున్న సినిమాలను వేగంగా పూర్తి చేయడానికి తనవంతు ప్రయత్నాల‌ను చిరూ చేస్తూనే ఉన్నాడు. ఈ సీనియర్ హీరోకు క‌థ‌లు రాయ‌డం ఈజీగానే ఉన్నా.. వాళ్లకు హీరోయిన్లను ఎంపిక చేయడం మాత్రం చాలా కష్టంగా మారిపోతోంది  ముఖ్యంగా చిరంజీవి లాంటి 60 ఏళ్ల పై బ‌డిన‌ హీరోలకు సరైన జోడీ తీసుకురావడం కోసం మేకర్స్ చుక్క‌లు చూస్తున్నారు.



    తమిళ దర్శకుడు మోహన్ రాజా లూసీఫ‌ర్‌ను తెరకెక్కిస్తున్నాడు. నిజానికి ఒరిజినల్ సినిమాలో హీరోయిన్ ఉండదు. తెలుగు రీమేక్‌లో కూడా చిరంజీవికి హీరోయిన్ లేదనే తెలుస్తుంది. కథను కాస్త చెడగొట్టడానికి మెగాస్టార్ కాస్త మార్పులు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లె పాత్రను చేసేందుకు మరో హీరోయిన్‌ను ఎంపిక చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా గురించి మేజర్ అప్‌డేట్ వచ్చింది. ఆచార్య చిత్రం లాగే ఇందులో కూడా గుడి సెట్ ఒకటి ఉంటుందని స‌మాచారం. ఆచార్య మూవీ పూర్త‌యిన వెంట‌నే లూసీఫ‌ర్‌ను రీమేక్ చేయ‌నున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: