పున్నమినాగు సినిమాతో కెరీర్ ని మొదలు పెట్టిన చిరంజీవి సైరా నరసింహారెడ్డి వరకు తన సినీ చరిత్రలో 151 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఎక్క‌డో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన‌ కొణిదెల శివశంకర వరప్రసాద్ కాస్త సుప్రీం హీరో - మెగాస్టార్ చిరంజీవి గా మారారు. చిరంజీవి తన కెరీర్లో ఎంతో మంది దర్శకులతో పని చేశారు. కె.రాఘవేంద్రరావు , కోదండరామి రెడ్డి , కోడిరామకృష్ణ , బి.గోపాల్ నుంచి నేటితరంలో వి.వి.వినాయక్ , సురేందర్రెడ్డి , కొరటాల శివ లాంటి దర్శకులు తోనూ ఆయన కలిసి పని చేశారు. చిరంజీవి ఎంతో మంది దర్శకులతో పని చేసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించినా ఆయన్ను తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్‌ను చేసింది మాత్రం కోదండరామిరెడ్డి అని చెప్పాలి.

ఇది వాస్తవం... తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. చిరంజీవి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయిన ఖైదీ - అత్తకి యముడు అమ్మాయికి మొగుడు - యముడికి మొగుడు , ముఠా మేస్త్రి , అభిలాష ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. అలాంటి కోదండరామిరెడ్డి తోనే చిరంజీవి తీవ్రమైన విభేదాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఇప్పుడు సరైన సంబంధాలు లేవని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటారు. కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినా కోదండరామిరెడ్డి ఒకే సమయంలో అటు చిరంజీవి , ఇటు బాలక్రిష్ణతో సమాంతరంగా సినిమాలు చేస్తూ ఇద్దరితోనూ హిట్లు కొట్టారు.

బాలకృష్ణ తో సినిమాలు చెయ్యటానికి ముందు కోదండరామిరెడ్డి ఎక్కువగా చిరంజీవితోనే సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే బాలయ్యతో కోదండరామిరెడ్డి సినిమాలు చేయడం మొదలు పెట్టాక చిరంజీవితో గ్యాప్‌ పెరిగిందని అంటారు. కొన్ని మంచి కథలు బాలయ్య కి వెళ్లడం చిరంజీవికి కోపం తెప్పించింది ప్రచారం అయితే అప్పట్లో జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ముఠామేస్త్రి సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య పూర్తిగా మాటలు లేవని టాక్. ఇక కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్‌ను హీరోగా పరిచయం చేసే కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించినా రాలేదని కూడా ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: