హీరోగా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ ప్రస్తుతం దర్శకత్వం చేస్తున్నాడు.. బిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు సాధించిన అయన గతంలో పలు చిత్రాలు చేసినా ఈ చిత్రంతోనే హీరోగా గుర్తింపు సాధించాడు. ఆ సినిమా తర్వాత విడుదల చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కాగా విజయ్ కి మంచి మార్కెట్ ఏర్పడింది.. తొలుత మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించి గుర్తింపు పొందిన విజయ్ ఆంటోనీ తెలుగులో రవితేజ మహాత్మ, దరువు వంటి చిత్రాలకు సంగీతం అందించాడు..

ఆ తరువాత హీరోగా మారడంతో మ్యూజిక్ చేయడం తగ్గించాడు. హీరోగా సలీమ్, నకిలీ వంటి చిత్రాలు చేసిన విజయ్ ఆంటోనీ తమిళనాట పిచ్చాయ్ కారన్ సినిమా తో సూపర్ హిట్ కొట్టి అక్కడ కూడా హీరోగా నిలదొక్కున్నాడు విజయ్.. బిచ్చగాడు పేరుతో తెలుగులో అనువదించి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ సినిమా కి సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమా ని స్వీయ దర్శకత్వంలో చేస్తున్నాడు.. ఈ సినిమా కి సంబంధించిన లుక్ ఇటీవలే విడుదల కాగా దీనిని ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఆవిష్కరించాడు.  తెలుగునాట ఈ పోస్టర్ కి మంచి స్పందన దక్కుతుంది..

పోస్టర్ తోనే ఎంతో క్యూరియాసిటీ ని పెంచిన ఈ సినిమా తనకు హిట్ ఇస్తుందని భావిస్తున్నాడు విజయ్ ఆంటోనీ.. దానికి తోడు సంగీతం కూడా అందిస్తుదనడం అందరిలో ఎంతో ఆసక్తి ని కలిగిస్తుంది. సంగీత దర్శకుడుగా, ఎడిటర్ గా, హీరోగా పలు పాత్రలు పోషించి ఇంత దూరం వచ్చిన విజయ్ ఆంటోనీ ఇక దర్శకుడిగా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తాడా చూడాలి. బిచ్చగాడు సినిమాను నిర్మించిన విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా భాష్య శ్రీ మాటలు అందిస్తుండడం విశేషం. ఈ రోజు విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా కి సంబదించిన అనౌన్స్ మెంట్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: