ఓ మాజీ మంత్రికి న‌టి చాందిని షాక్ ఇచ్చారు. రూ.10 కోట్లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలంటూ కోర్టులో దావా వేసింది. అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌ పై ఈ మేర‌కు గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మలేషియాకు చెందిన నటి చాందిని స్థానిక బీసెంట్‌నగర్‌లో ఉంటున్నారు. గ‌తంలో మణికంఠన్‌ పెళ్లి చేసుకుంటానని తనతో సహజీవనం చేసి మోసం చేశాడ‌ని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి మణికంఠన్‌ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం ఈ మాజీ మంత్రిగారి రాసలీలలు ఇష్యూ తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి.


కాగా మణికంఠన్ తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. జయలలిత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖామంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. అయితే, జయలలిత మ‌రణం తరువాత చిన్నమ్మ శ‌శిక‌ళ‌కు ముఖ్య అనుచరుడిగా మారాడు.

   
నోమాడ్స్ చిత్రంతో చాందిని క్రేజ్ దక్కించుకున్నారు. తెలుగులో త‌మ్ముడు చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో కంఠ‌న్‌తో పరిచయం ఏర్పడింది. ఆ ప‌రిచ‌యం కాస్త‌ సహజీవనానికి దారితీసింది. గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్తూ తనతో కాపురం చేస్తున్నాడని.. ఇప్పుడు పెళ్లికి నిరాక‌రిస్తున్నాడంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. అంతేకాదు ఇద్దరం ఏకాంతంగా గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెడ్తా అంటూ  బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. రౌడీలతో దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో న‌టి చాందిని ఫిర్యాదు చేసింది.

ఈ కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పరిస్థితుల్లో చాందిని తాజాగా గురువారం స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేయడం సంచలనం రేపింది. ఈ పిటీష‌న్‌లో మాజీమంత్రి మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని చాందిని పేర్కొన్నారు. అదే విధంగా తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంటుంద‌ని దానికి గాను అయ్యే నెలవారి ఖర్చులు కూడా మాజీ మంత్రినే చెల్లించాలని ఆ పిటిషన్‌లో కోరారు. కాగా ఈ పిటీషన్‌పై వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ విష‌యంపై త‌మిళ‌నాడులో చ‌ర్చజ‌రుగుతోంది. విచార‌ణ అనంత‌రం ఏ విధంగా తీర్పు వ‌స్తుంద‌ని వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: