సినిమాల్లో ఒక హీరో - హీరోయిన్ కలిసి ఎక్కువ సినిమాల్లో నటిస్తే వారిద్దరి మధ్య సంబంధం గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తుంటాయ‌న్న‌ది తెలిసిందే. ఎంత గొప్ప హీరో అయినా కెరీర్లో ఏదో ఒక సమయంలో ఈ పుకార్లు ఎదుర్కోక తప్పదు. మెగాస్టార్ చిరంజీవికి సైతం ఇబ్బంది ఎదురైంది. స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో రాధ - విజయశాంతి - సుహాసిని లాంటి హీరోయిన్లతో ఎక్కువగా సినిమాలు చేసేవారు. ఈ క్రమంలోనే చిరంజీవి - రాధిక కాంబినేషన్ కు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. చిరంజీవితో పోటీపడి మరీ రాధిక డ్యాన్సులు చేసేవారు. అప్పుడే చిరంజీవి కి కొత్తగా సురేఖతో పెళ్లి అయింది .ఇటు చిరు కెరీర్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. క్షణం తీరిక లేని బిజీ షెడ్యూల్... వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ సమయంలో లో చిరంజీవి తన భార్య సురేఖను వెంట పెట్టుకుని మరి ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లిపోయే వాడట.

పగలంతా చిరంజీవి షూటింగ్ ల‌తో బిజీగా ఉంటే సురేఖ అక్కడ ఉన్న షూటింగ్‌ ప్రదేశాలను ఎంజాయ్ చేయటం లేదా ఒంటరిగా ఉండాల్సి వచ్చేదట‌.
ఇక రాత్రి వేళల్లో షూటింగ్ అయ్యాక కూడా ఒక్కోసారి తాము ఉంటున్న గది గోడ దూకి మరి వెళ్లి పక్కనే ఉన్న రాధిక దగ్గరకు వెళ్ళే వాడట. పగలంతా రాధిక‌తోనే షూటింగ్ చేసినా... రేపు సీన్స్ రిహార్స‌ల్స్‌ గురించి షూటింగ్.. ఆ రోజు షూటింగ్‌ ముచ్చట్లు గురించి పదేపదే చర్చలు జరిపే వాడట. అయితే ఆ సమయంలో రాధిక‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా పక్కనే ఉండేవారు.

అయితే రాధిక మాత్రం సురేఖ మీకోసం ఎదురు చూస్తున్నారు... మీరు వెళ్ళండి అని చెప్పి మ‌రీ బ‌ల‌వంతంగా చిరును పంపించేద‌ట‌. ఈ విష‌యాన్ని త‌ర్వాత సురేఖ సైతం ప‌లు సంద‌ర్భాల్లో గుర్తు చేసుకున్నారు. అప్ప‌ట్లో చిరు - సురేఖను అవుట్ డోర్ షూటింగ్‌ల‌కు తీసుకు వెళ్లిన‌ప్పుడు రాధిక‌తోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఆ స‌మ‌యంలో రాధిక - సురేఖ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: