సినీ ఇండస్ట్రీ లోకి రావాలి అంటే వయసుతో సంబంధం లేదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే  వారిలో ఉన్న ప్రతిభను చూపించడం కోసం, అది ఏ వయస్సు వారైనా సరే సినీ ఇండస్ట్రీ ఆహ్వానిస్తుంది. వారిలో ఉన్న నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతారు అని తెలిసిన రోజు, సినీ ఇండస్ట్రీ తప్పకుండా వారికి స్వాగతం పలుకుతుంది. అందుకే చాలామంది చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ.. వారిలో ఉన్న ప్రతిభను ప్రేక్షకులకు చూపిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు కూడా తమ వారసులను, సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశపెడుతున్నారు.

అంతే కాదు ఇక్కడ భాషతో సంబంధం లేకుండా ప్రతి భాష చలన చిత్రాలలో నటిస్తూ దేశమంతట,  వారికి ఉన్న ఖ్యాతిని పెంచుకుంటూ.. చేతులారా బాగా సంపాదించుకుంటున్నారు.ఇక అసలు విషయానికొస్తే, ఇక్కడ 64 సంవత్సరాల వయసు కలిగిన  ఒక వృద్ధుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అతనెవరో కాదు.. మంచు మనోజ్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ , అనుష్క కలసి నటించిన చిత్రం వేదం. ఈ వేదం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి,  బాగా గుర్తింపు పొందిన వేదం నాగయ్య. ఆయన ఆర్థికంగా కష్టాల్లో మునిగిపోయినప్పుడు సినీ ఇండస్ట్రీ లోకి రావాలని అనుకున్నారట.

అదే సమయంలో శేష జీవితం ఆనందంగా గడపాల్సిన సమయంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సినీ ఇండస్ట్రీలో కి రాకముందు ఊరూరు తిరుగుతూ గొడుగులు అమ్మేవారట. ఇక ఈ సినిమాలో నటించాక ఆయనకు ఉత్తమ సహయనటుడు గా నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఆ తర్వాత 30 సినిమాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాకపోతే వేదం సినిమా ఈయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు.అంతేకాదు సహకుడి పాత్రలో ఆ వయసులో మొదటి సినిమాతోనే నంది అవార్డు పొందిన నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: