మనలో టాలెంట్ ఉండి నటించే సత్తా ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టు నటన తప్పక అవసరం పడుతుంది. నటనలో పూర్తిగా శిక్షణ పొందిన అప్పుడే మనం సినీ ఇండస్ట్రీ లోకి రావడానికి అర్హులం అవుతాము. అలా ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎంతో మంది హీరోలు.. కూడా ఎవరో ఒకరి దగ్గర ముందు శిక్షణ తీసుకున్న తర్వాతనే , సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే మన సినీ ఇండస్ట్రీలో తెర ముందు ఏం జరుగుతుందో మాత్రమే తెలుసుకోగలుగుతాం.. కానీ తెర వెనుక ఎవరున్నారు, ఎవరి కారణంగా వీరు ఈ స్థాయికి ఎదిగారు అనే విషయాలు ఎప్పటికీ ,ఎవరికీ తెలియదు అని మాత్రం చెప్పవచ్చు.

అయితే వీరిలో ఉన్న నటనను వెలికితీసి, వీరికి నటనకు మరింత నైపుణ్యం చేకూర్చి, వీరిని స్టార్ హీరోలుగా తీర్చిదిద్దిన వారు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు దేవదాసు కనకాల. ఈయన గురించి ఇటీవల కాలంలో తక్కువ మందికి తెలిసి ఉండవచ్చు. ఈయన ముఖ్యంగా ఎంతో మంది హీరోలకు శిక్షణ ఇచ్చి , నటనలో స్టార్ పొజిషన్ చేరుకోవడానికి సహాయం చేశారు. ఇక ముఖ్యంగా వీరి కోడలు సుమ కనకాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 2 దశాబ్దాలకు పైగా బుల్లితెరపై మహారాణిగా తన సింహాసనాన్ని ,వేరొకరికి చేరనివ్వకుండా చూసుకుంటూ జాగ్రత్త పడుతోంది. రెండు చేతుల బాగా సంపాదిస్తూ మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె, సినిమా నటిగా కూడా కొన్ని సినిమాలలో నటించింది.

ఇక వీరి కొడుకు రాజీవ్ కనకాల కూడా సినిమాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యంగ్ టైగర్  ఎన్టీఆర్ బిజినెస్ వ్యాపారాలను చూసుకుంటూ, మరోపక్క సినిమాలలో నటిస్తున్నాడు. కనకాల దేవదాస్ మెగాస్టార్ చిరంజీవి , భానుచందర్, ప్రదీప్ శక్తి, రఘువరన్, శుభలేఖ సుధాకర్, రాజేంద్రప్రసాద్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలకు శిక్షణ ఇచ్చాడు. ఇక ఈయన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడుగా అలాగే  నాటకాలకు కూడా దర్శకత్వం వహించే వాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: