దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన న‌టి వ‌నితా విజయ్ కుమార్ ప్రస్తుతం తెలుగులో  సినిమాలు చేయడం లేదు కానీ తమిళ్ లో టీవీ షోలు... సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరో వైపు తన యూట్యూబ్ ఛానల్ లో వంటలు చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఇదిలా ఉండగా వనితా విజయకుమార్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న‌ సంగతి తెలిసిందే. దాంతో ఈ నటి పై ఎన్నో విమర్శలు వచ్చాయి. మూడు పెళ్ళిళ్ళతో తమిళ ఇండ‌స్ట్రీలోనే కాకుండా తెలుగు, హిందీ ఇతర భాషల్లోనూ వనిత విజయకుమార్ వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల వనితా విజయ్ కుమార్ తమిళ నటుడు పవర్ స్టార్ శ్రీనివాసన్ తో కలిసి దండలు మార్చుకున్న ఒక ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

అయితే ఈ ఫోటోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకుండా లవ్ ఎమోజీలను జోడించింది. దాంతో వనిత విజయకుమార్ మరో పెళ్లి చేసుకుందా ఏంటి అన్న అనుమానం అందరిలో మొదలైంది. ఇలాంటి అనుమానం రావడానికి కారణం కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం వనిత విజయకుమార్ ను ఓ నెటిజెన్ నువ్వు మ‌ళ్లీ ప్రేమలో ఉన్నావా అని అడగ్గా అవునంటూ సమాధానమిచ్చింది. దాంతో వ‌నితా విజ‌య్ కుమార్ పెళ్లి ఫోటోలు షేర్ చేయ‌గానే ఆమె మ‌రో పెళ్లి చేసుకుంద‌ని అంతా భావించారు.

కానీ తాజాగా వనిత విజయకుమార్ అందర్నీ ఫూల్ చేసినట్టుగా అర్థం అయిపోయింది. పవర్ స్టార్ శ్రీనివాసన్ తో విజయ్ కుమార్ ప్ర‌స్తుతం ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమా షూటింగ్ కు సంబంధించిన పెళ్లి ఫోటోలు వ‌నితా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. మొత్తానికి మూడు పెళ్ళిళ్ళతో ఫేమస్ అయిన ఈ నటి ...ఇప్పుడు పెళ్లి పోస్టర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన సినిమాకు క్రేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నించింది. ఇక ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: