ముమైత్ ఖాన్ చత్రపతి, పోకిరి వంటి సినిమాలలో ఐటమ్ గర్ల్  గా కనిపించి మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. ఆ  తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా  కనిపించింది . తాజాగా 'మంగతాయారు టిఫిన్ సెంటర్' ప్రొడ్యూసర్ పైడి బాబు, ముమైత్ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేద్దాము అని ఆలోచనలో ఉన్నప్పుడు హీరోలు మనకు డేట్స్ ఇవ్వడం కష్టం అనే ఉద్దేశంతో అప్పటికే 'ఎవడైతే నాకేంటి' సినిమా లో ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన ముమైత్ ఖాన్ నటన చూసి ఈ అమ్మాయి తో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తే వర్కౌట్ అవుతుందని ఉద్దేశంతో వెళ్లి కలిశామని ఆమెకు తెలియజేయగా నేను  హీరోయిన్  నా అని చెప్పి నవ్వి , ఏమి ఇస్తారు నాకు అని అడిగింది. దానికి ప్రొడ్యూసర్ చెప్పండి మేడం అని అడగగా నేను ఒక పాటకు నాలుగు లక్షలు తీసుకుంటాను.

మీరు సినిమా అంటున్నారు కాబట్టి 50 లక్షలు ఇవ్వండి అని అడిగింది. ఈ సినిమాకు అంత వర్కౌట్ అవదు మేడం 22 లక్షల వరకు ఒప్పుకోండి అనడంతో అలాగే అని చెప్పి ఒప్పుకుంది. వెంటనే రెండు లక్షలు అడ్వాన్సు కూడా ఇచ్చాం. అలాగే ఈ సందర్భంలో ప్రొడ్యూసర్ ముమైత్ ఖాన్ బిజినెస్ క్లాస్ లోనే ప్రయాణం చేసేదని, ఓన్లీ జెట్ ఎయిర్వేస్ లోనే వచ్చేదని.  సినిమా కమర్షియల్గా వర్కౌట్ అయిందా అని యాంకర్ అడగడంతో బ్యాలెన్స్ అయింది సార్, సాటిలైట్ రైట్స్ ద్వారా డబ్బులు వచ్చాయి.  దాసరి నారాయణ రావు గారు అప్పట్లో  'డీ' అనే సాటిలైట్ ఛానల్ పెట్టి ఉద్దేశంతో ఈ సినిమాను కొన్నట్లు నిర్మాత పైడి బాబు తెలిపాడు. ప్రస్తుతం ముమైత్ ఖాన్ సినిమాలకు కొంచెం దూరం గానే ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: