ఎస్. ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్లో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.ఇక ఇటీవలే  ఈ కాంబినేషన్ కి సంబంధించి ప్రకటన వచ్చింది.ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రోజుకో వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.ఇక రాజమౌళి సినిమాలకి కథలను అందించే ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకి సైతం కథను అందిస్తున్నారు.ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.అయితే బాహుబలి సినిమా తర్వాత రైటర్ గా విజయేంద్రప్రసాద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.

ఇక బాలీవుడ్ లోని కొన్ని సినిమాలకు సైతం ఈయనే కథలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.ముఖ్యంగా మహేష్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాని సౌతాఫ్రికాకు చెందిన ప్రముఖ రచయిత విల్ బుర్ స్మిత్ నవల ఆధారంగా కథను అందిస్తున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగానే ఆయన ఇప్పటికే ఆ నవలను చదివేసినట్లు చెప్పాడు.ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ అడ్వెంచరస్ ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పుకొచ్చాడు విజయేంద్రప్రసాద్.

ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో రూపొందించాలనే ప్లాన్ లో ఉన్నాడట రాజమౌళి.దీంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి విజువల్ వండర్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి.ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇంకా కేవలం రెండు పాటల చిత్రీకరణ మిగిలిన్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదటి సారి కలిసి నటిస్తున్నారు.అటు మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక వీరి కాంబినేషన్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: