ఒకప్పుడు స్క్రీన్ పై తెలుగు ప్రేక్షకులను అలరించిన బాల నటీమణులు ఇప్పుడు సరికొత్త గా కనిపిస్తూ ప్రేక్షకులను అప్పుడే ఈ పాప ఇంత పెద్ద అయిందా అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. కొందరు సినిమా ఇండస్ట్రీ లోనే ఉంటూ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చెబుతుంటే మరికొందరు అప్పుడు అవకాశం వచ్చింది సినిమాల్లో చేశాను ఇప్పుడు వేరే రంగంలో స్థిరపడతాను అని అంటున్నారు. అయితే చాలామంది సినిమాల్లో నటించడానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. చిన్నతనంలో తమ ముద్దు ముద్దు మాటలతో అలరించిన వీరు ఇప్పుడు తమ అందాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.

ఆవిధంగా గా గంగోత్రి సినిమా లోని వల్లంకి పిట్ట అనే పాటతో అందరినీ మెప్పించిన కావ్య ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా గంగోత్రి. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను సృష్టించింది. సుమన్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించగా రాఘవేంద్రరావు ఇది 100వ సినిమా కావడం విశేషం. కీరవాణి అద్భుతమైన పాటలు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి సినిమాగా అల్లు అర్జున్ ని నటుడిగా నిలబెట్టిన సినిమా ఇది.

అయితే గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్ర చేసిన పాపా ఇప్పుడు పెద్ద అమ్మాయి అయిపొయింది. ఆమె పేరు కావ్య. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేనందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆమెకు సంబందించిన ఫొటోలో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఆమెను చూసి అప్పుడే ఇంత ఎత్తు ఎదిగిందా అని ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్లే ఆమె ఇప్పుడు ఈ ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుందట. ఈనేపథ్యంలో కొందమంది దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో నటింపచేసేందుకు ఆమెను సంప్రదిస్తున్నారట. మరి త్వరలోనే ఆమెను హీరోయిన్ గా చూడబోతున్నాం మనం..  

మరింత సమాచారం తెలుసుకోండి: