తమిళ స్టార్ ఆర్య నటించిన స్పోర్ట్స్ డ్రామా "సర్పట్ట పరంబరై", తెలుగులో "సర్పట్ట పరంపర" వివాదంలో చిక్కుకుంది. దివంగత ముఖ్యమంత్రి, యాక్టర్ ఎంజిఆర్‌ను సినిమాలో తక్కువ చేసి చూపించారంటూ 'సర్పట్ట పరంపర' సినిమాపై ఎడిఎంకె మాజీ మంత్రి జయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి సినిమాను రూపొందించినందుకు చిత్రనిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీనికి సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కురిశాయి. 70వ దశకంలో జరిగే బాక్సింగ్ డ్రామాతో పాటు, జరిగిన రాజకీయ సంఘటనలను కూడా ఈ చిత్ర దర్శకుడు చూపించారు. పదవీకాలంలో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి, ఆ సమయంలో కరుణానిధి ఏం చేశారు ? తమిళనాడును డిఎంకె పార్టీ ఎలా రక్షించింది ? చివరకు ఎంజిఆర్ ఆ సమయంలో అధిష్టానాన్ని ఎలా చేజిక్కించుకున్నారు ? అనే విషయాలను తెరపై దర్శకుడు కళ్ళకు కట్టాడు. అయితే ఎంజీఆర్ కాలంలో ఏడిఎంకే పార్టీలో ఫేక్ లిక్కర్ కుర్రాళ్ళు చేరినట్టు చూపించారు. 

ఈ విషయం చాలా మంది ఏడిఎంకే పార్టీ సభ్యులను రెచ్చగొట్టింది. ఇప్పుడు మాజీ మంత్రి జయకుమార్ ఈ విషయం గురించి మాట్లాడుతూ "సర్పట్ట పరంబరై సినిమాలో ఎంజిఆర్ చెడుగా చూపించడం చాలా బాధగా ఉంది. చరిత్రను కళ రూపంలో దాచడం చాలా పెద్ద తప్పు. ఈ చిత్రం పూర్తిగా ఒక డిఎంకే   ఎన్నికల ప్రచారంలాగా కన్పిస్తోంది. వారు ఎంజిఆర్ పనులతో సంబంధం లేని విధంగా చాలా సన్నివేశాలను రూపొందించారు. ఎంజిఆర్ తమిళనాడులో అనేక మంది క్రీడాకారులను తీసుకువచ్చారు" అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు చిత్రబృందం సినిమా సక్సెస్ అయ్యిందని చాలా సంతోషంగా ఉంది. ఇక నిన్ననే ఆర్య భార్య, హీరోయిన్ సాయేషా సైగల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ ఆయన సన్నిహితుడు, స్నేహితుడు విశాల్ వెల్లడించారు. వారి కుటుంబానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మరి చిత్రబృందం ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: